Share News

కేన్సర్‌పై అవగాహన ర్యాలీ

ABN , Publish Date - Feb 06 , 2024 | 12:21 AM

కేన్సర్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన కల్పిం చుకోవడంతో పాటు తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుసు కోవాలని మణిపాల్‌ హాస్పటల్‌ డాక్టర్‌ ఆర్‌.దినేష్‌ రెడ్డి పేర్కొ న్నారు.

 కేన్సర్‌పై అవగాహన ర్యాలీ

కేన్సర్‌పై అవగాహన ర్యాలీ

లబ్బీపేట, ఫిబ్ర వరి 5: కేన్సర్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన కల్పిం చుకోవడంతో పాటు తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుసు కోవాలని మణిపాల్‌ హాస్పటల్‌ డాక్టర్‌ ఆర్‌.దినేష్‌ రెడ్డి పేర్కొ న్నారు. సిద్ధార్థ మహిళా కళాశాలలో కళాశాల డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోకెమిస్ర్టీ, జూనియర్‌ చాంబర్‌ ఇంటర్నేషనల్‌ విజయవాడ ఇంపాక్ట్‌ సంయుక్త ఆధ్వర్యంలో కేన్సర్‌పె అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మట్లాడుతూ శరీరంలో అసాధారణ లక్షణాలు ఉంటే వైద్యుడిని సంప్రదిం చాలన్నారు. ముఖ్యంగా మహిళల్లో రొమ్ము, గర్భశయ కేన్సర్లు సంభవిస్తాయని, వాటిపై ప్రతి మహిళా అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. స్ర్కీనింగ్‌ పరీక్షల ద్వారా రొమ్ము కేన్సర్‌ను గుర్తించవచ్చని, పెల్విక్‌ పరీక్ష, అలా్ట్రసౌండ్‌, బయాప్సీ, ఇమేజింగ్‌ పరీక్షల ద్వారా గర్భాశయ కేన్సర్‌ను నిర్ధారించవచ్చని తెలిపారు. కేన్సర్‌పై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. కళాశాల డైరెక్టర్‌ టి.విజయలక్ష్మి. ప్రిన్సిపాల్‌ ఎస్‌.కల్పన పాల్గొన్నారు.

Updated Date - Feb 06 , 2024 | 12:21 AM