నడకుదురు రేవులో బుసక తవ్వకాలు
ABN , Publish Date - Feb 04 , 2024 | 01:29 AM
మండలంలోని నడకుదురురేవులో నిబంధ నలకు విరుద్ధంగా జరుగుతున్న బుసక తవ్వకాలను రైతులు అడ్డుకున్నారు.
అడ్డుకున్న రైతులు..జగనన్న లే అవుట్ పేరుతో బయటకు తరలిస్తున్నారని ఆగ్రహం
చల్లపల్లి, ఫిబ్రవరి 3: మండలంలోని నడకుదురురేవులో నిబంధ నలకు విరుద్ధంగా జరుగుతున్న బుసక తవ్వకాలను రైతులు అడ్డుకు న్నారు. శుక్రవారం రాత్రి తవ్వకాలు జరుగుతుండటంతో నడకుదురు, పురిటిగడ్డ, రాముడుపాలెం గ్రామాలకు చెందిన 20 మంది రైతులు, యువకులు తవ్వకాలు జరిగే ప్రదేశానికి వెళ్లారు. రాత్రివేళల్లో తవ్వకాలు ఏమిటని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరపటానికి వీల్లేదని, పంటపొలాలకు దగ్గరగా తవ్వకాలు చేస్తే భూగర్భజలాలకు ముప్పు ఏర్పడుతుందని, తవ్వకాలు నిలుపుదల చేయాలని పట్టుబట్టారు. రేవులో ఏడు టిప్పర్లు లోడై ఉండటంతో వాటిలోని బుసకను రేవులోనే అన్‌లోడ్ చేయించారు. బుసక అన్‌లోడ్ చేసేందుకు తొలుత ఒప్పుకోన ప్పటికీ రైతులు పట్టుబట్టడంతో ఎట్టకేలకు అన్‌లోడ్ చేసి టిప్పర్లు వెళ్లిపో యాయి. రేవులో ఉన్న బుసకను తవ్వే ప్రొక్లెయిన్‌ను తీసుకెళ్లిపోవాలని సూచించారు. లారీలో ఉదయాన్నే తీసుకెళతామని డ్రైవర్ చెప్పి, తవ్వకం జరిగే ప్రదేశం నుంచి యంత్రాన్ని వెనక్కి తీసుకువచ్చాడు. దీంతో రైతులు వెనుతిరిగివచ్చేశారు.
పాగోలు జగనన్న లే అవుట్ పేరుతో విక్రయాలు
బుసక తవ్వకాలపై ప్రశ్నిస్తే పాగోలు జగనన్న లే అవుట్‌కు బుసకను తోలుతున్నామని చెబుతున్నారని, కానీ ఆ పేరుతో బుసకను బయట అనధికారికంగా విక్రయిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లేఅవుట్‌కు కంటే బయటకే భారీగా బుసక తరలిస్తున్నారని ఆరోపించారు.
రైతుల భవిష్యత్‌తో చెలగాటమాడితే ఊరుకోం.. టీడీపీ నేతల హెచ్చరిక
నడకుదురు రేవులో బుసక తవ్వకాలు జరిపిన ప్రదేశాన్ని టీడీపీ నేతలు మోర్ల రాంబాబు, పరు చూరి సురేష్‌బాబు, కైతేపల్లి శ్రీనివాసరావు, పరిశే మౌళి, రాజులపాటి జగదీష్ శనివారం మధ్యాహ్నం పరిశీలిం చారు. అర్ధరాత్రి ఇవతలకు వచ్చేసిన ప్రొక్లెయిన్ తిరిగి బాటను సరి చేసుకుంటూ కనిపించేసరికి రైతులు, నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల భవిష్యత్‌తో చెలగాటం ఆడటం మంచిది కాదనీ, మరోసారి తవ్వకాలు చేపడితే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. దీంతో డ్రైవర్లు అక్కడి నుంచీ వెళ్లిపోయారు.