Share News

మైలవరంలో నోట్ల కట్టలు

ABN , Publish Date - May 13 , 2024 | 01:45 AM

మైలవరంలో సామాన్యుడుకి సీటిచ్చామని చెబుతున్న వైసీపీ అధిష్టానం ఆ పార్టీ అభ్యర్థి సర్నాల తిరుపతిరావును గెలి పించేందుకు అష్టకష్టాలు పడుతోంది. ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనబడు తుండటంతో వైసీపీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు అనేక కుయుక్తులు పన్నుతోంది.

మైలవరంలో నోట్ల కట్టలు
ఇంట్లో నగదును స్వాధీనం చేసుకుంటున్న జి.కొండూరు ఎస్సై షబ్బీర్‌ అహ్మద్‌

గతంలో తాయిలాలు.. తాజాగా ఓటుకు నోటు..రెచ్చిపోతున్న వైసీపీ బ్యాచ్‌

విజయవాడ, మే 12: మైలవరంలో సామాన్యుడుకి సీటిచ్చామని చెబుతున్న వైసీపీ అధిష్టానం ఆ పార్టీ అభ్యర్థి సర్నాల తిరుపతిరావును గెలి పించేందుకు అష్టకష్టాలు పడుతోంది. ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనబడు తుండటంతో వైసీపీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు అనేక కుయుక్తులు పన్నుతోంది. డబ్బు ఎదజల్లి మైలవరంలో గెలిచే ప్రయత్నాలు చేస్తోంది. కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు టీడీపీ నేతలు మాట్లాడుకున్నట్లు ఇతర కులాలను బూతులు తిట్టినట్లు ఒక ఫేక్‌ ఆడియోను ఇటీవల వైరల్‌ చేసింది. తాజాగా పోలింగ్‌ ముందురోజున నోట్లకట్లతో ఓటర్లను ప్రలోభ పెడుతోంది. సీటిస్తాం..ఖర్చు భరిస్తాం వైసీపీ తరఫున పోటీ చేయాలని చెప్పినా వినకుండా సిట్టింగ్‌ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్‌ టీడీపీ లోకి వచ్చి కూటమి అభ్యర్థిగా పోటీలో నిలవడం, ఏమాత్రం రాజకీయ అను భవం లేని జడ్పీటీసీ సభ్యుడిని తొలిసారి ఎమ్మెల్యే రేసులో వైసీపీ నిలప డంతో వైసీపీ ఓటమి దాదాపు ఖాయమైందని రాజకీయ విశ్లేషకులు అంటు న్నారు. మంత్రి జోగి రమేష్‌ మంత్రాంగం నడిపి జి.కొండూరు ఎంపీపీ వేములకొండ లక్ష్మీతిరుపతమ్మకు దక్కాల్సిన మైలవరం సీటును యాదవ సామాజికవర్గానికి చెందిన సర్నాల తిరుపతిరావుకు దక్కేలా చేశాడు. ఒకవేళ ఇక్కడ సర్నాల గెలిచి.. తాను పెనమలూరులో ఓడినా మైలవరం ఇన్‌చార్జిగా పెత్తనం వెలగబెట్టవచ్చని జోగి ఎత్తుగడ వేసి, ఈక్రమంలోనే తన సొంత సామాజికవర్గమైన లక్ష్మీతిరుపతమ్మను కాదని యాదవ సామా జికవర్గానికి జోగి సీటు ఇప్పించాడు. కానీ, జాకీలు వేసి లేపినా సర్నాల గ్రాఫ్‌ ఏమాత్రం పెరగకపోగా, వైసీపీ ద్వితీయశ్రేణి నాయకుల నుంచి సర్నా లకు పూర్తి సహకారం లభించడం లేదు. దీంతో రెడ్డి సామాజికవర్గానికి చెం దిన ముగ్గుర్ని ఆయన మీద పెత్తనానికి పెట్టారు. అయినా ఫలితం లేకపో వడంతో సజ్జల సైతం మైలవరం వచ్చి, ఎలాగైనా సర్నాలను గెలిపించాలని మంత్రాంగం చేసి, డబ్డు దండిగా ఇచ్చి వెళ్లాడని తెలుస్తోంది. దీంతో ప్రచా రం ముగియగానే వైసీపీ నాయకులు ఓట్లను కొనుగోలు చేయడం ప్రారం భించారు. ఈక్రమంలోనే హెచ్‌.ముత్యాలంపాడులో దాచిన డబ్బును పోలీ సులు స్వాఽధీనం చేసుకున్నారని తెలిసింది.

వైసీపీ నేత ఇంట్లో రూ.40 లక్షలు స్వాధీనం

జి.కొండూరు: మండలంలోని హెచ్‌.ముత్యాలంపాడు గ్రామంలో ఓ వైసీపీ నాయకుడి ఇంట్లో దాచిన రూ.40 లక్షలను ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జి.కొండూరు ఎస్సై షబ్బీర్‌ అహ్మద్‌ కథనం మేరకు గ్రామానికి చెందిన చల్లా చలపతి అనే వైసీపీ నాయకుడి ఇంట్లో ఉంచిన రూ.40 లక్షలను పక్కా సమాచారంతో దాడి చేసి స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఆ నగదును స్వాధీనం చేసు కుని, అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

వైసీపీ డబ్బు రూ.57 వేలు స్వాధీనం

రెడ్డిగూడెం, మే 12: రెడ్డిగూడెం ఎస్సీ కాలనీలో ఆదివారం రాత్రి ఓట ర్లకు డబ్బు పంచుతున్న వైసీపీ నాయకుడిని అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న రూ.57 వేలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై యు.గోవింద్‌ తెలిపారు.

డబ్బు అందలేదని ఓటర్ల ఆందోళన

మైలవరం వైసీపీ కార్యాలయం వద్ద పడిగాపులు

మైలవరం, మే 12: వైసీపీ మైలవరం అభ్యర్థి సర్నాల తిరుపతిరావుకు చెందిన నోట్ల కట్టలు రూ.40 లక్షల పోలీసులు పట్టుకోవడం రెండ్రోజల నుంచి ఓటుకు రూ.2 వేలు చొప్పున పంచడం, భారీగా మద్యం పంచడం ఇప్పుడు మైలవరం నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశమయ్యింది. ఈ క్రమంలో నోట్ల పంపకం వ్యవహారం వికటించింది. ఒకరికి పంచి మరొకరికి మొండిచెయ్యి చూపించడంతో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు మైలవరం వైసీపీ కార్యాలయానికి ఆటోలో పెద్ద సంఖ్యలో మహిళలు వివిధ ప్రాంతాల నుంచి ఓటర్‌ స్లిప్పు తీసుకొని వచ్చారు. మేము వైసీపీ కోసం ఇంత కష్ట పడితే మా సొమ్ము కూడా మీరే నొక్కేస్తారా అని కార్యాలయంలో ఉన్న వారిని నిలదీశారు. సొమ్ములు ఇస్తేనే ఇక్కడి నుంచి బయటకు వెళ తామని నిలదీయడంతో అక్కడి నుంచి నాయకులు జారుకున్నారు. సామాన్యుడిపై పెట్టిన పెత్తందార్లు ఓటర్లకు పంచే డబ్బులు మింగేశారని ఓట్లకు డబ్బులు అందని వారు బహిరంగంగా వ్యాఖ్యానించారు.

Updated Date - May 13 , 2024 | 01:45 AM