Share News

బాబుకు బ్రహ్మరథం!

ABN , Publish Date - Apr 08 , 2024 | 01:25 AM

చంద్రబాబు ప్రజాగళం సభకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పార్టీ అధినేత ఉపన్యాసాలకు పామర్రు, ఊయ్యూరు సభలు దద్దరిల్లాయి. చలోక్తులు, వైసీపీ నేతల అక్రమాలు, ప్రభుత్వ అరాచకాలపై వ్యంగ్యాస్ర్తాలు సంధించిన ప్రతిసారీ జనం జయజయధ్వానాలతో మోతమోగాయి. విచ్చలవిడిగా గంజాయి వెదజల్లే ప్రభుత్వం కావాలా? రాజధాని నిర్మించి రాష్ట్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపే ప్రభుత్వం కావాలా? నిలకడ లేని నేత కావాలా? జనంలో నిలిచే నేత కావాలా? అని పోలికలు పెట్టి చెప్పిన తీరుకు జనం చప్పట్లు, ఈలలతో మద్దతు తెలిపారు. ఇలా పామర్రు, ఊయ్యూరులలో ఆదివారం జరిగిన ప్రజాగళం సభలు ఉత్సాహంగా.. ఉల్లాసంగా, ఆద్యంతం ఆసక్తిగా సాగాయి. ఎటుచూసినా టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలు రెపరెపలాడాయి.

బాబుకు బ్రహ్మరథం!

జిల్లాలో ఉత్సాహంగా సాగిన ప్రజాగళం సభలు

వైసీపీ నేతలపై విమర్శనాస్ర్తాలకు జనం చప్పట్లు

అడుగడుగునా నీరాజనం

ఉయ్యూరులో హైటెక్‌ సిటీ వంటి టవర్స్‌ నిర్మాణం

జూ మంత్రి జోగి కాదు... రోగ్‌

ఆయన పెనమలూరుకే ప్రమాదకరం

బాలశౌరి, వర్ల కుమార్‌ రాజా, బోడె ప్రసాద్‌లను గెలిపించాలని పిలుపు

చంద్రబాబు ప్రజాగళం సభలు సూపర్‌ సక్సెస్‌

చంద్రబాబు ప్రజాగళం సభకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పార్టీ అధినేత ఉపన్యాసాలకు పామర్రు, ఊయ్యూరు సభలు దద్దరిల్లాయి. చలోక్తులు, వైసీపీ నేతల అక్రమాలు, ప్రభుత్వ అరాచకాలపై వ్యంగ్యాస్ర్తాలు సంధించిన ప్రతిసారీ జనం జయజయధ్వానాలతో మోతమోగాయి. విచ్చలవిడిగా గంజాయి వెదజల్లే ప్రభుత్వం కావాలా? రాజధాని నిర్మించి రాష్ట్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపే ప్రభుత్వం కావాలా? నిలకడ లేని నేత కావాలా? జనంలో నిలిచే నేత కావాలా? అని పోలికలు పెట్టి చెప్పిన తీరుకు జనం చప్పట్లు, ఈలలతో మద్దతు తెలిపారు. ఇలా పామర్రు, ఊయ్యూరులలో ఆదివారం జరిగిన ప్రజాగళం సభలు ఉత్సాహంగా.. ఉల్లాసంగా, ఆద్యంతం ఆసక్తిగా సాగాయి. ఎటుచూసినా టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలు రెపరెపలాడాయి.

నాపేరు డ్రైవర్‌ చంద్రుడు...

నేను డ్రైవర్‌ చంద్రుణ్ణి. నేను అనుభవం ఉన్న డ్రైవర్‌ని. నా బస్సు ప్రగతిపథం వైపునకు దూసుకుపోతుంది. ఈ బస్సు ఎక్కిన వారంతా సురక్షితంగా ఉంటారు. ప్రజలంతా అభివృద్ధికి పట్టంకటాలి. రాబోయే ఎన్నికల్లో ప్రతి ఇంటి నుంచి సైనికులు తయారు కావాలి. పిల్లలు జెండా పట్టుకుని ఊరూరా తిరిగి ప్రచారం చేయాలి.

అవసరమైతే హైటెక్‌ సిటీలాంటి టవర్స్‌....

అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయితే అందులో ఉయ్యూరు ఒక భాగం అయ్యేది. జగన్‌ పాలనలో సొంత స్థలం ఉన్నా ఇల్లు నిర్మించుకోలేని పరిస్థితి ఏర్పడింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అవసరమైతే ఉయ్యూరులో హైటెక్‌ సిటీలాంటి టవర్స్‌ నిర్మాణం చేస్తా. అందులోనే పలు ఐటీ కంపెనీలను ఏర్పాటు చేస్తా. దీంతోపాటు టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తా. కృష్ణా డెల్టా ఆధునీరణ పూర్తి చేస్తా. కుందేరు వంతెన నిర్మాణాన్ని పూర్తి చేస్తా.

రోగ్‌తో చాలా ప్రమాదం...

అతను జోగి రమేష్‌ కాదు. ఒక రోగ్‌. అతనికి జిల్లాలో ఎక్కడా మంచి పేరు లేదు. ఇప్పటి వరకు పెడన నియోజకవర్గాన్ని పిండేసిన ఈ రోగ్‌ ఇప్పుడు పెనమలూరు వచ్చాడు. అతను చాలా ప్రమాదకరం. బంటుమిల్లు మండలంలో సెంటుపట్టా ఇవ్వడానికి ఒక్కొక్క లబ్ధిదారు నుంచి రూ.50 వేలు వసూలు చేశాడు. నా ఇంటిమీదకి కర్రలతో దాడి చేయడానికి వచ్చి నాపైనే కేసు పెట్టారు. వైసీపీలో మంచి వాళ్లకు స్థానం లేదు. బూతులు తిట్టే కొడాలి నాని, పేర్ని నాని, రోగ్‌ రమేష్‌ వంటి వారికి మాత్రమే స్థానాలు ఉన్నాయి

ఆంధ్రజ్యోతి, విజయవాడ/పామర్రు/ మచిలీపట్నం/ఉయ్యూరు : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార సభలకు పామర్రు, పెనమలూరు నియోజకవర్గం, ఉయ్యూరులో జనం పోటెత్తారు. పామర్రు, ఉయ్యూరు సెంటర్లలో నలుదిక్కులు టీడీపీ, జనసేన, బీజేపీ, కార్యకర్తలు, అభిమానులతో నిండిపోయాయి. పామర్రు, ఉయ్యూరులలో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రజాగళం సభల్లో ప్రజలను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకుంది. పామర్రులో గంటసేపు ప్రసంగించారు. పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించి ఉయ్యూరు మార్కెట్‌ సెంటర్లో సభ నిర్వహించారు. ధ్వంసమైన రాష్ట్ర పునర్‌నిర్మాణం కోసం ప్రజలు బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి మద్దతు ఇచ్చి గెలింపించాలని చంద్రబాబు కోరారు. గతంలో టీడీపీ తరుపున పోటీచేసి ఓడిపోయినప్పటికీ పార్టీనే నమ్ముకని పనిచేస్తున్న వర్ల రామయ్య తనయుడు కుమార్‌ రాజా వద్ద నగదు లేనప్పటికీ అభ్యర్థిగా నిలబెట్టానని, కోటి రూపాయలు కూడా వర్ల వద్ద లేవని, వర్లను ఉద్దేశించి పదేపదే గెలిపించాలని చంద్రబాబు అన్న సమయంలో కుమార్‌రాజా భావోద్వేగం ఆపుకోలేక కన్నీటిపర్యంతమయ్యారు. ఇప్పటివరకు వైసీపీ ఎంపీగా ఉండి, ఆ పార్టీ నాయకుల ఆగడాలను, భరించలేక వల్లభనేని బాలశౌరి జనసేన టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థిగా పోటీచేస్తున్నారని ఆయనను గెలిపించాలని చంద్రబాబు పదేపదే కోరారు. పామర్రు నియోజకవర్గం ఎమ్మెల్యే కైలే పామర్రులో మినీ లోటస్‌పాండ్‌ మాదిరిగా భవనం నిర్మాణం చేసుకున్నారని, ఇసుక, గ్రావెల్‌ దోపిడీలో రూ.కోట్లు గడించారని, అభివృద్ధిని మాత్రం గాలికొదిలేశారని దుయ్యబట్టారు. జగన్‌కు గొడ్డలి పట్టుకుని తిరిగేవారు కావాలని, గంజాయి బ్యాచ్‌ కావాలని, నగదు కావాలని, తనకు మాత్రం ప్రజలను గుండెల్లో పెట్టుకునే నాయకులు కావాలని చెప్పడంతో జనం ఈలలతో హుషారెత్తారు.

అడుగడుగున్నా నీరాజనం

టీడీపీ అధినేత చంద్రబాబుకు జనం అడుగడుగునా నీరాజనం పలికారు. ఆదివారం పామర్రులో మచిలీపట్నం- విజయవాడ రహదారి వెంబడి ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు 4.36 గంటలకు ఆయన చేరుకున్నారు. ఆయనకు టీడీపీ నాయకులు కొనకళ్ల నారాయణరావు, దేవినేని ఉమా, వర్ల కుమార్‌రాజా, ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, గొట్టిపాటి రామకృష్ణ స్వాగతం పలికారు. అనంతరం బస్సులోకి వచ్చిన ఆయన కొద్దిసేపు నాయకులతో మంతనాలు జరిపారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి ఎన్టీఆర్‌ విగ్రహం సెంటరుకు చేరుకున్నారు. దారిపొడవునా మహిళలు, యువత ఆయనకు స్వాగతం పలికారు. సభావేదిక వద్ద గజమాలతో ఆయనను సత్కరించారు. పామర్రు నుంచి ఉయ్యూరు మార్కెట్‌ సెంటరు వరకు 12 కిలోమీటర్ల దూరం ఉండగా దారిపొడవునా ఆయన రాకకోసం అభిమానులు వేచి ఉండి హరతులతో స్వాగతం పలికారు.

అమరావతిని నాశనం చేశారు : ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి

పామర్రులో జరిగిన ప్రజాగళం కార్యక్రమం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు అఽధ్యక్షతన జరిగింది. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థి వల్లభనేని బాలశౌరి మాట్లాడారు. ‘విశాఖపట్నంలో సీఎం వైఎస్‌ జగన్‌ రూ.500కోట్లతో ఇల్లు కట్టుకున్నాడు. మూడు ప్రాంతాల్లో రాజధాని కోసం ఒక్క ఇటుక వేయలేదు. పేదలకు ఒక్క ఇంటిని కూడా నిర్మాణం చేయలేకపోయారు. రాజదాని ఎక్కడుందో చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది’ అని ఆయన అన్నారు.

రైతులకు తీరని అన్యాయం : వర్ల కుమార్‌రాజా

వైసీపీ ప్రభుత్వ హాయాంలో రైతులకు తీరని అన్యాయం చేశారని పామర్రు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి వర్ల కుమార్‌ రాజా అన్నారు. ‘బడుగు, బలహీన వర్గాలకు టీడీపీ అండగా ఉంది. యువతను వీధిన పడేసిన ఘనత వైసీపీది. ధరలను అమాంతం పెంచి పేదల బతకుతో ఆటలాడుకుంది’ అని కుమార్‌రాజా అన్నారు.

Updated Date - Apr 08 , 2024 | 01:25 AM