Share News

మెరుగైన సేవలు అందించాలి

ABN , Publish Date - May 31 , 2024 | 12:35 AM

విజయవాడ రైల్వే డివిజన్‌లో పనితీరును మరింత మెరుగుపరచి ఆదాయాలను పెంచాలని డివిజన్‌ కమర్షియల్‌ మేనేజర్‌(డీసీఎం) వావిలపల్లి రాంబాబు ఆదేశించారు.

మెరుగైన సేవలు అందించాలి
మాట్లాడుతున్న వావిలపల్లి రాంబాబు

మెరుగైన సేవలు అందించాలి

డీసీఎం వావిలపల్లి రాంబాబు

రైల్వేస్టేషన్‌, మే 30: విజయవాడ రైల్వే డివిజన్‌లో పనితీరును మరింత మెరుగుపరచి ఆదాయాలను పెంచాలని డివిజన్‌ కమర్షియల్‌ మేనేజర్‌(డీసీఎం) వావిలపల్లి రాంబాబు ఆదేశించారు. రైల్వే డివిజన్‌ కార్యాలయంలోని సమావేశపు హాల్‌లో గురువారం వాణిజ్య విభాగం పనితీరుపై సమీక్ష నిర్వహించారు. డీసీఎం మాట్లాడుతూ ప్రయాణికుల అనుభవాలను వారి డిమాండ్‌లను పరిగణనలోకి తీసుకుని మరింత మెరుగైన సేవలు అందించాలన్నారు. టికెట్ల ద్వారా ఆదాయం, సరుకు రవాణా, పార్సిళ్ల లోడింగ్‌, ప్రయాణ చార్జీలు మినహా వివిధ రంగాలలో సమకూరుతున్న ఆదాయాలను సమీక్షించి మరింతగా సాధించాలని కోరారు. వినియోగదారులకు సంతృప్తికర సేవలందించాలని సూచించారు. ప్రయాణికుల, కోచ్‌ ఫిర్యాదులను కూడా పరిగణనలోకి తీసుకుని ఆ మేరకు చర్యలు చేపట్టాలని, వృద్ధ ప్రయాణికులకు మెరుగైన సేవలందించాలని పేర్కొన్నారు. జోనల్‌ రైల్వే విభాగం నిర్థేశించిన లక్ష్యాలను సాధించడం కోసం కృషి చేయాలన్నారు. డీసీఎం ఎండీ ఆలీఖాన్‌, ఏసీఎం వి.రవివర్మ, ఏసీఎం శైలే ష్‌కుమార్‌ సింగ్‌, ఇన్‌స్పెక్టర్లు , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 31 , 2024 | 12:35 AM