Share News

బెల్టుషాపుల జోరు!

ABN , Publish Date - May 20 , 2024 | 12:21 AM

మండలంలోని బెల్టు షాపుల్లో మద్యం వ్యాపారం జోరుగా సాగుతోంది. పెనమలూరులో ఏ మూల వెతికినా మద్యం చిటికెలో లభిస్తోంది. పెనమలూరు వంతెన, తాడిగడప పాతవంతెన, పోరంకి సెంటరు, యనమలకుదురు లాకులు, సాలిపేట, పోరంకి స్మశానం రోడ్డు, కామయ్యతోపు సెంటరు తదితర ప్రాంతాల్లో మద్యం బెల్టు షాపుల నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు మూసిన వెంటనే బెల్టు షాపుల నిర్వాహకులు నడిరోడ్డుపైనే మొబైల్‌ మద్యం దుకాణాలకు తెరలేపుతున్నారు.

 బెల్టుషాపుల జోరు!

ఫ పెనమలూరు మండలంలో 24 గంటలూ మద్యం అందుబాటులో ఫ ఎన్నికల్లో పంచగా మిగిలిన మందు బెల్టుషాపుల్లోకి ఫ క్వార్టరుకు అదనంగా రూ. 60 వసూలు ఫ బందరు రోడ్డుకిరువైపులా పలు హోటళ్లలో మద్యం అమ్మకాలు

పెనమలూరు, మే 19 : మండలంలోని బెల్టు షాపుల్లో మద్యం వ్యాపారం జోరుగా సాగుతోంది. పెనమలూరులో ఏ మూల వెతికినా మద్యం చిటికెలో లభిస్తోంది. పెనమలూరు వంతెన, తాడిగడప పాతవంతెన, పోరంకి సెంటరు, యనమలకుదురు లాకులు, సాలిపేట, పోరంకి స్మశానం రోడ్డు, కామయ్యతోపు సెంటరు తదితర ప్రాంతాల్లో మద్యం బెల్టు షాపుల నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు మూసిన వెంటనే బెల్టు షాపుల నిర్వాహకులు నడిరోడ్డుపైనే మొబైల్‌ మద్యం దుకాణాలకు తెరలేపుతున్నారు. మోటారుసైకిళ్లపై వచ్చిన వ్యక్తులు తమ జేబుల్లోంచి మద్యం బాటిళ్లు తీసి విక్రయిస్తున్నారు. క్వార్టరు బాటిల్‌కు కనీసం అరవై రూపాయలు తక్కువ కాకుండా అమ్ముకుంటున్నారు. మొన్నటి ఎన్నికలలో రాజకీయ పార్టీలు ఓటర్లకు పంచగా మిగిలిపోయిన తెలంగాణ, గోవా, కర్నాటక మందు బెల్టు షాపుల నిర్వాహకుల వద్ద విరివిగా లభ్యమవుతోంది. స్థానిక ప్రభుత్వ మద్యం దుకాణాల సిబ్బంది కూడా బెల్టు షాపుల నిర్వాహకులకు సహకరిస్తుండంతో దుకాణాల్లోని క్వార్టరు సీసాలు బెల్టుషాపులకు చేరుతున్నాయి. మరో పక్క పెనమలూరు సమీపంలోని ప్రభుత్వ మద్యం దుకాణాలు బార్లను తలపిస్తున్నాయి. ప్రభుత్వ దుకాణాల వద్ద హోటళ్లకు, బడ్డీకొ ట్లకు అనుమతులు లేకపోయినా మద్యం కొనుక్కొన్న వ్యక్తులు అక్కడే మద్యం సేవిస్తుండడం వివాదాలకు తావిస్తోంది. మరో పక్క బందరు రోడ్డుకు ఇరువైపులా ఉన్న హోటళ్లలో మద్యం సేవించడం మామూలయింది. కొన్ని హోటళ్లలో సిబ్బంది స్వయంగా మద్యాన్ని సరఫరా చేయడం, దానికి తగ్గట్లు అధిక మొత్తంలో బిల్లులు బాది వసూలు చేయడం పరిపాటిగా మారింది. హైవే ప్రక్కన హోటళ్లలో అర్ధరాత్రి వరకూ మద్యం అందుబాటులో ఉండడం విశేషం. ప్రస్తుత సీఐ రామారావు బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్లలో కొంతవరకు బెల్టుషాపులపై ఉక్కుపాదం మోపినా మళ్లీ మొదటికి వచ్చింది. బెల్టు షాపులను నిరోధించడం, ప్రభుత్వ మద్యం దుకాణాల్లోని మద్యం ప్రక్క తోవ పట్టకుండా నియంత్రించాల్సిన అఽధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం ఆలోచింపదగ్గ విషయం. ఇకనైనా బెల్టు షాపుల నిర్వాహకులకు ముకుతాడు వేసేలా స్థానిక పోలీసు యంత్రాంగం, ఆబ్కారీ శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - May 20 , 2024 | 12:21 AM