Share News

ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన పొందాలి

ABN , Publish Date - Dec 28 , 2024 | 12:46 AM

విద్యార్థులు ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన పెంచుకోవాలని అపుడే భవిష్యత్‌లో ప్రమా దాలు తగ్గడానికి ఆస్కారం ఉంటుందని 5వ ట్రాఫిక్‌ స్టేషన్‌ సీఐ రవికుమార్‌ హితవు పలికారు.

ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన పొందాలి
మాట్లాడుతున్న సీఐ రవికుమార్‌

ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన పొందాలి

5వ ట్రాఫిక్‌ స్టేషన్‌ సీఐ రవికుమార్‌

మొగల్రాజపురం, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులు ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన పెంచుకోవాలని అపుడే భవిష్యత్‌లో ప్రమా దాలు తగ్గడానికి ఆస్కారం ఉంటుందని 5వ ట్రాఫిక్‌ స్టేషన్‌ సీఐ రవికుమార్‌ హితవు పలికారు. మొగల్రాజపురం వీపీ సిద్ధార్థ పబ్లిక్‌ స్కూల్‌లో విద్యార్థులకు శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సురక్షిత, ప్రమాద రహిత ప్రయాణం, హెల్మెట్‌ అవశ్యకతను తెలియజేశారు. బస్‌లలో ప్రయాణం చేసేటపుడు కిటికీల నుంచి చేతులు బయట పెట్టరాదని, లైసెన్సు లేకుండా, హెల్మెట్‌ లేకుండా వాహనాలు నడపొద్దన్నారు. సిగ్నల్స్‌ను చూసి రోడ్డు దాటాలని, వాహనం నడిపేటపుడు సెల్‌ఫోన్‌లో మాట్లాడవద్దని, సైబర్‌ క్రైం నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, ఏటీఎం, బ్యాంకు ఖాతాల పిన్‌ నెంబర్లు చెప్పవద్దని సూచించారు. వీఐపీలు, వీవీఐపీలు ప్రయాణం చేసేటపుడు ట్రాఫిక్‌ పోలీసులు తీసుకునే చర్యలను చెప్పారు. ఈ సమావేశంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ మేడా సీతారామయ్య, ట్రాఫిక్‌ ఆర్‌ఎస్‌ఐ వెంకటకుమార్‌, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2024 | 12:46 AM