Share News

బీసీల అభ్యున్నతి కూటమితోనే సాధ్యం: బాలశౌరి

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:43 AM

బీసీల అభ్యున్నతి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి అన్నారు.

బీసీల అభ్యున్నతి కూటమితోనే సాధ్యం: బాలశౌరి
కోసూరులో జయహో బీసీ సదస్సులో మాట్లాడుతున్న వల్లభనేని బాలశౌరి, పక్కన వర్ల కుమార్‌రాజా, వీరంకి గురుమూర్తి

కూచిపూడి, ఏప్రిల్‌ 26: బీసీల అభ్యున్నతి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి అన్నారు. శుక్రవారం కోసూరులో నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో బీసీల సంక్షేమానికి పెద్దపీట వేసిందని, అనేక సం క్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసిందని ఆయన తెలిపారు. వైసీపీ ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి పెట్టిన అనేక పథకాలను రద్దు చేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయంపై బీసీలు ఆగ్రహంతో రగిలి పోతున్నారని కూటమి పామర్రు నియోజకవర్గ అభ్యర్థి వర్ల కుమార్‌ రాజా అన్నారు. బీసీలంతా టీడీపీని గెలిపించుకునేందుకు తహతహలాడుతున్నా రన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో బీసీ లకు ఇచ్చిన పథకాలను అమలు చేయటంతోపాటు వారి అభ్యున్నతికి, సంక్షే మానికి పెద్ద పీట వేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేతలు వీరంకి వెంకట గురుమూర్తి, తాడిశెట్టి నరేష్‌, నన్నపనేని వీరేంద్ర, లింగమనేని రామ లింగేశ్వరరావు, తాతా నారాయణరావు, వీరంకి తులసీదాసు, వీర్ల నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 12:43 AM