Share News

బీసీలే టీడీపీకి పట్టుగొమ్మలు: వైవీబీ

ABN , Publish Date - Apr 03 , 2024 | 01:03 AM

బీసీలే తెలుగుదేశం పార్టీకి పట్టుగొమ్మలని, ఆయా వర్గాల అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్‌ అన్నారు. స్థానిక పార్టీ కార్యాయంలో మంగళవారం 9వ క్లష్టర్‌ ఇన్‌చార్జ్‌ కూనపరెడ్డి వాసు ఆధ్వర్యంలో నిర్వహించిన జయహోబీసీ కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్‌, పెనమలూరు ఇన్‌చార్జ్‌ బోడె ప్రసాద్‌, బీసీ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి పాల్గొని ప్రసంగించారు.

బీసీలే టీడీపీకి పట్టుగొమ్మలు: వైవీబీ
జయహో బీసీ సభలో మాట్లాడుతున్న రాజేంద్రప్రసాద్‌

ఉయ్యూరు, ఏప్రిల్‌ 2 : బీసీలే తెలుగుదేశం పార్టీకి పట్టుగొమ్మలని, ఆయా వర్గాల అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్‌ అన్నారు. స్థానిక పార్టీ కార్యాయంలో మంగళవారం 9వ క్లష్టర్‌ ఇన్‌చార్జ్‌ కూనపరెడ్డి వాసు ఆధ్వర్యంలో నిర్వహించిన జయహోబీసీ కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్‌, పెనమలూరు ఇన్‌చార్జ్‌ బోడె ప్రసాద్‌, బీసీ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి పాల్గొని ప్రసంగించారు. బడుగు, బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే గుర్తింపు, అభివృద్ధి సాధ్యమైందని పలువురు నాయకులు అన్నారు. సగర సాధికార రాష్ట్ర కన్వీనర్‌ జంపన శ్రీనివాస్‌, ఉయ్యూరు మాజీ చైర్మన్‌ జంపాన పూర్ణచంద్రరావు, పట్టణ అధ్యక్షుడు జంపాన గుర్నాధరావు, బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శులు పీత గోపీచంద్‌, రాజులపాటి ఫణి, నియోజకవర్గ అధ్యక్షుడు సంగెపు రంగారావు, గోలి వసంతకుమార్‌, చలపాటి శ్రీను, సుబ్బారావు, మైనారిటీ నాయకుడు అ జ్మతుల్లా, జనసేన నాయకుడు కార్తీక్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉంగుటూరు : బీసీల సంక్షేమం, సమగ్రాభివృద్థే ధ్యేయంగా టీడీపీ, జనసేన, కూటమి బీసీ డిక్లరేషన్‌ విడుదల చేయటం జరిగిందని, దీంతో బీసీల దశ-దిశ మారనుందని పలువురు టీడీపీ నాయకులు అన్నారు. గన్నవరం నియోజకవర్గంలో క్లస్టర్ల వారీగా జరుగుతున్న జయహో బీసీ డిక్లరేషన్‌ కార్యక్రమం మంగళవారం ఉంగుటూరు మండలంలోని తేలప్రోలు, ఇందుపల్లి గ్రామాల్లో జరిగింది. ఇందుపల్లిలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర బీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి మాట్లాడుతూ టీడీపీకి బీసీలే వెన్నెముక అని, బీసీలు సమగ్రాభివృద్థి సాధించాలన్న లక్ష్యంతో పది అంశాలతో బీసీ డిక్లరేషన్‌ ప్రకటించటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్రకార్యదర్శి దొంతు చిన్నా, బచ్చుల సుబ్రహ్మణ్యం (బోసు), కొండేటి కొండలు, పామర్తి కిషోర్‌బాబు, కొండేటి వెంకటేశ్వరరావు, ఆరుమళ్ల వెంకటకృష్ణారెడ్డి, ఆళ్ల హనోక్‌, సర్నాల బాలాజీ, బొర్రపురెడ్డి గణేష్‌, భీమవరపు వెంకటరెడ్డి, చల్లగోళ్ల లక్ష్మణరావు, నక్కా వెంకటేశ్వరరావు, ఉయ్యూరు మురళి పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2024 | 01:03 AM