Share News

మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైను సాధిస్తా : బాలశౌరి

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:29 AM

నీతి, నిజాయితీలతో స్వార్ధం లేని సేవలందిస్తామనీ, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్ధులు వల్లభనేని బాలసౌరి, మండలి బుద్ధప్రసాద్‌ స్పష్టం చేశారు.

  మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైను సాధిస్తా : బాలశౌరి

చల్లపల్లి, ఏప్రిల్‌ 18 : నీతి, నిజాయితీలతో స్వార్ధం లేని సేవలందిస్తామనీ, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్ధులు వల్లభనేని బాలసౌరి, మండలి బుద్ధప్రసాద్‌ స్పష్టం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశం లంకతోట రోడ్డులో యువ పారిశ్రామికవేత్త గుత్తికొండ వంశీకృష్ణ ప్రాంగణంలో గురువారం రాత్రి జరిగింది. పెద్దఎత్తున నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. ఎంపీ వల్లభనేని బాలసౌరి మాట్లాడుతూ, ఎంపీగా నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు కృషిచేశానన్నారు. పోర్టు ప్రారంభం, మెడికల్‌ కళాశాల ఏర్పాటులో తన కృషిని వివరించారు. అవనిగడ్డ నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక మచిలీపట్నం-.రేపల్లె రైల్వే లైనును వచ్చే ఐదేళ్లలో సాధిస్తానని హామీఇచ్చారు. పామర్రు-చల్లపల్లి రహదారిని జాతీయ రహదారిగా మార్పుచేయిస్తానన్నారు. ఎదురుమొండి వంతెన నిర్మాణం పూర్తిచేయటంతోపాటు, పోర్టు ఆధారిత పరిశ్రమలు తీసుకువస్తానన్నారు. బుద్ధప్రసాద్‌తో కలిసి నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తామన్నారు. అవనిగడ్డ నియోజకవర్గ కూటమి అభ్యర్ధి మండలి బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ, దివిసీమ ఎమ్మెల్యేల ఘన చరిత్రను ప్రస్తుత ఎమ్మెల్యే సింహాద్రి రమే్‌షబాబు కాలరాశారని మండిపడ్డారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు అవకాశమున్న చల్లపల్లిని ఇద్దరం కలిసి అభివృద్ధి చేస్తామని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్‌డి.విల్సన్‌ మాట్లాడుతూ, జగన్‌ ప్రభుత్వం ఎస్సీలకు తీరని ద్రోహం చేసిందని మండిపడ్డారు. ఆయా పార్టీల మండల అధ్యక్షులు మోర్ల రాంబాబు, చోడగం విమల్‌ కృష్ణ, పిండి రేవతి, బీజేపీ నేత చిరువోలు బుచ్చిరాజు, టీడీపీ నేతలు యార్లగడ్డ శ్రీనివాసరావు, పైడిపాముల కృష్ణకుమారి, ముమ్మనేని నాని, సజ్జా చలపతిరావు, నిడమానూరి దిలీ్‌పకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 12:29 AM