Share News

బడుగులంటే అలుసా?

ABN , Publish Date - Jan 06 , 2024 | 01:14 AM

ఓడిపోతారన్ని ముద్రవేసి పార్టీ నుంచి వెళ్లగొట్టడానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలే జగన్‌కు దొరికారా? బడుగు వర్గాల ఎమ్మెల్యేలంటే జగన్‌కి అలుసు అని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ అన్నారు. శుక్రవారం పోరంకిలో జరిగిన బాబు ష్యూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి ఆయన పాల్గొని ప్రజలతో మాట్లాడారు. ఎన్నికల ముందు నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ జగన్‌ మాట్లాడే మాటలు నీటిమూటలేనా అని ఎద్దేవా చేశారు

బడుగులంటే అలుసా?
పోరంకిలో స్థానికుల సమస్యలు తెలుసుకుంటున్న బోడె ప్రసాద్‌, ఇతర నాయకులు

ఫపార్టీ నుంచి వెళ్ల గొట్టడానికి జగన్‌కు బీసీ, ఎస్సీ, ఎస్టీలే దొరికారా?

ఫపోరంకిలో జరిగిన ‘బాబు ష్యూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీ’లో మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌

పెనమలూరు, జనవరి 5 : ఓడిపోతారన్ని ముద్రవేసి పార్టీ నుంచి వెళ్లగొట్టడానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలే జగన్‌కు దొరికారా? బడుగు వర్గాల ఎమ్మెల్యేలంటే జగన్‌కి అలుసు అని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ అన్నారు. శుక్రవారం పోరంకిలో జరిగిన బాబు ష్యూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి ఆయన పాల్గొని ప్రజలతో మాట్లాడారు. ఎన్నికల ముందు నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ జగన్‌ మాట్లాడే మాటలు నీటిమూటలేనా అని ఎద్దేవా చేశారు. ఒక పక్క సొంత పార్టీ నేత లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర పార్టీల్లోకి తొంగి చూడడం, మరో పక్క తల్లి, చెలి కాంగ్రెస్‌లో చేరి తనతోనే పోటీకి దిగుతుండడంతో దిక్కుతోచని జగన్‌రెడ్డికి నోట్లో వెలక్కాయ పడినట్లుందని పేర్కొన్నారు. బోడె వెంట అనుమోలు ప్రభాకరరావు, సంగెపు రంగారావు, బోడె సురేంద్ర, దేవినేని రాజా, యాళ్ల చక్రవర్తి, ముక్కామల నాని, షేక్‌ సలీం, రావి రాకేష్‌, వంగూరు పవన్‌ ఉన్నారు.

బోడె హేమ ఆధ్వర్యంలో..

తాడిగడప రాంనగర్‌లో జరిగిన బాబు ష్యూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో బోడె ప్రసాద్‌ సతీమణి హేమ నేతృత్వంలోని స్థానిక టీడీపీ మహిళా నేతలు మేడసాని రత్నకుమారి, రేఖ, నాగమణి, కనకదుర్గ, ప్రమీల, తుమ్మల రాంకుమార్‌, పీతా గోపీచంద్‌, రాజబాబు, నాగుల్‌మీరా, వెంకటేశ్వరరావు, పామర్తి సిద్ధయ్య, కిలారు రవివర్మ, మొక్కపాటి దామోదర్‌, కందుల ప్రసాద్‌ స్థానికులతో మాట్లాడి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బోడె ప్రసాద్‌ను, ముఖ్యమంత్రిగా చంద్రబాబును ఎన్నుకోవాలని కోరారు.

కానూరులో..

లోటు బడ్జెట్‌తో చేతికొచ్చిన ఆంఽధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నడిపిన చంద్రబాబు తయారీ నవ్యాంధ్రను ఉద్యమాంధ్రగా మార్చిన ఘనత సైకో జగన్‌రెడ్దిదేనని టీడీపీ కృష్ణాజిల్లా ఉపాఽధ్యక్షుడు వెలగపూడి శంకరబాబు, టీడీపీ నేతలు దేవినేని గౌతమ్‌, స్మిత దంపతులు పేర్కొన్నారు. శుక్రవారం కానూరులో వేర్వేరు చోట్ల జరిగిన బాబు ష్యూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాల్లో వారు పాల్గొని ప్రజలతో మాట్లాడారు. అన్ని వర్గాలకు హామీలిచ్చి గద్దెనెక్కి తీరా వంచించడంతో ప్రతి వర్గం నేడు సమ్మెల బాటలో ప్రయాణిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉపాధ్యాయులు, ఉద్యోగులు, అంగన్‌వాడీలు, మునిసిపల్‌ కార్మికులు, సర్వశిక్షా అభియాన్‌ ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల వారు సమ్మె పేరుతో రోడ్డెక్కడం ఏ రాష్ట్రంలోనైనా చూశామా అని ప్రశ్నించారు. అభివృద్ది పథంలో నడిపిస్తున్న చంద్రబాబును కాదని జగన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసినందుకు ప్రజలు అన్ని జిల్లాల్లో పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసి తిరిగి రాష్ర్టాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపు నిచ్చారు. వారి వెంట స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

వైసీపీని సాగనంపడం ఖాయం

చినఓగిరాల(ఉయ్యూరు) : విద్యుత్‌, బస్సు చార్జీల పెంపు, నిత్యావసరాల ధరల పెరుగుదలతో సామన్య మధ్య తరగతి ప్రజల నడ్డివిరిచిన వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ మండల అధ్యక్షుడు యెనిగళ్ల కు టుంబరావు, క్లష్టర్‌ ఇన్‌చార్జ్‌ కొండా ప్రవీణ్‌ అన్నారు. చిన ఓగిరాలలో శుక్రవారం బాబూ ష్యూరిటీ- భవిష్య త్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. టీడీపీ, జనసేన అధికారంలోకి వచ్చిన తరువాత అమలయ్యే సంక్షే మ, అభివృద్ధి పథకాలు తెలియజేశారు. బీసీ సెల్‌ నియోజకవర్గ అధ్యక్షుడు సంగేపు రంగారావు, సర్పం చ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు గోలి వసంతకుమార్‌, సాయిపురం, జబర్లపూడి సర్పంచ్‌లు జాన్‌బాషా, సూరపనేని ప్రసాద్‌, ఆరేపల్లి వెంకటేశ్వరరావు, బందెల గణేశ్‌, రామకృష్ణ, సజ్జా మధు పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2024 | 01:15 AM