అయ్యో పాపం
ABN , Publish Date - Dec 27 , 2024 | 01:09 AM
పాల పెదవుల ఆర్తి ఇంకా తీరలేదు.. అమ్మ పొత్తిళ్లలో వెచ్చదనం పూర్తిగా అందనేలేదు.. ఆ పసికందు కళ్లు తెరవకముందే అనాథగా మారింది.

చెత్తకుప్పలో పసికందు
కంచికచర్లలో ఘటన
కంచికచర్ల రూరల్, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : పాల పెదవుల ఆర్తి ఇంకా తీరలేదు.. అమ్మ పొత్తిళ్లలో వెచ్చదనం పూర్తిగా అందనేలేదు.. ఆ పసికందు కళ్లు తెరవకముందే అనాథగా మారింది. హృదయ విదారకమైన ఈ ఘటన కంచికచర్లలో రాజ్యలక్ష్మి గ్యాస్ కంపెనీ రోడ్డులో గురువారం తెల్లవారుజామున జరిగింది. ఏ తల్లికి ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ, అప్పుడే పుట్టిన పసిపాపను ముళ్ల పొదల్లో విసిరేసింది. ఈ రోడ్డులో వెళ్తున్న పాదచారులకు పాప ఏడుపులు వినిపించి అక్కున చేర్చుకున్నారు. అప్పటికే చిన్నారి చేతివేళ్లను చీమలు కుట్టేశాయి. తొలుత ఆ పసికందును వైద్యం నిమిత్తం పీహెచ్‌సీకి తరలిం చారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీ డాక్టర్ మధురిమ మాట్లాడుతూ పసికందుకు వెంటనే ఆసుపత్రికి తీసుకురావడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింద న్నారు. కాగా, మెరుగైన వైద్యం నిమిత్తం పాపను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.