Share News

వ్యాధులపట్ల అవగాహన కల్పించేందుకు ఫ్రైడే డ్రైడే

ABN , Publish Date - Oct 26 , 2024 | 12:24 AM

దోమల ద్వారా వచ్చే వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి శుక్రవారం డ్రై డే ఫ్రైడే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రోగ్రాం మానిటరింగ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ నవీన్‌ తెలిపారు.

వ్యాధులపట్ల అవగాహన   కల్పించేందుకు ఫ్రైడే డ్రైడే
నిల్వ ఉన్న నీటిని పరిశీలిస్తున్న సిబ్బంది

వ్యాధులపట్ల అవగాహన

కల్పించేందుకు ఫ్రైడే డ్రైడే

జిల్లా ప్రోగ్రాం మానిటరింగ్‌ ఆఫీసర్‌

డాక్టర్‌ నవీన్‌

రామలింగేశ్వరనగర్‌, అక్టోబరు 25 (ఆంధ్ర జ్యోతి): దోమల ద్వారా వచ్చే వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి శుక్రవారం డ్రై డే ఫ్రైడే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రోగ్రాం మానిటరింగ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ నవీన్‌ తెలిపారు. శుక్రవారం రామలింగేశ్వరనగర్‌, రాణిగారితోట, భ్రమరాం బపురం ప్రాంతాల్లో డ్రై డే కార్యక్రమం నిర్వహించి నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో దోమల లార్వాను పరీశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో వైద్య ఆరోగ్య శాఖ, మలేరియా అధికారులు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో మురికినీరు, నిల్వ ఉన్న నీరు, ఇళ్ల పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని పరిశీలించి, దోమల లార్వాను గుర్తించి నిర్మూలిస్తామని, స్థానికులకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. స్థానికంగా జ్వరాలు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారిని గుర్తించి వారికి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్‌ యూనిట్‌ అధికారి శ్రీనివాస్‌, హెల్త్‌ సూపర్‌వైజర్‌ జగదీష్‌, హెల్త్‌ అసిస్టెంట్‌ నాంచారయ్య, ఇతర మున్సిపల్‌ సిబ్బంది, ఏఎన్‌ఎంలు అశాలు పాల్గొన్నారు.

Updated Date - Oct 26 , 2024 | 12:24 AM