తాడిగడప మునిసిపాలిటీకి అవార్డులు
ABN , Publish Date - Jan 27 , 2024 | 01:10 AM
తాడిగడప మునిసిపాలిటీకి అవార్డుల పంట పండింది. మచిలీపట్నంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ పి.రాజాబాబు నుంచి తాడిగడప మునిసపల్ కమిషనర్ డాక్టర్ ప్రకాశరావు ఉత్తమ మునిసిపల్ కమిషనర్ అవార్డును అందుకున్నారు.
పెనమలూరు: తాడిగడప మునిసిపాలిటీకి అవార్డుల పంట పండింది. మచిలీపట్నంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ పి.రాజాబాబు నుంచి తాడిగడప మునిసపల్ కమిషనర్ డాక్టర్ ప్రకాశరావు ఉత్తమ మునిసిపల్ కమిషనర్ అవార్డును అందుకున్నారు. కలెక్టర్ నుంచి శానిటరీ ఇన్‌స్పెక్టర్ సూర్యవర్ధనరావు, మేనేజరు విజలక్ష్మి, డీఈ రాజారావు, టీపీవో గిరి, సీనియర్ అసిస్టెంట్లు నాగలక్ష్మి, అరుణకుమారి, జూనియర్ అసిస్టెంట్లు గంగాభవాని, నాగభూషణ్ చౌదరి, ఇం జనీరింగ్ అసిస్టెంటు ఫణీంద్ర, సిబ్బంది శ్రీకాంత్, సతీష్, భార్గవ్ అవార్డులు అందుకున్నారు.