Share News

రైల్వే ఆసుపత్రిలో ఆస్తమా డే

ABN , Publish Date - May 08 , 2024 | 12:40 AM

ప్రపంచ ఆస్తమా దినం సందర్భంగా విజయవాడ రైల్వే ఆసుపత్రిలో మంగళవారం ఆస్తమా వ్యాధిపై వైద్య నిపుణులు రోగులు, రోగి సహాయకులకు అవగాహన కల్పించారు

రైల్వే ఆసుపత్రిలో ఆస్తమా డే
మాట్లాడుతున్న శౌరిబాల

రైల్వే ఆసుపత్రిలో ఆస్తమా డే

రైల్వేస్టేషన్‌, మే 7: ప్రపంచ ఆస్తమా దినం సందర్భంగా విజయవాడ రైల్వే ఆసుపత్రిలో మంగళవారం ఆస్తమా వ్యాధిపై వైద్య నిపుణులు రోగులు, రోగి సహాయకులకు అవగాహన కల్పించారు. ఆసుపత్రి చీఫ్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ ఎం. శౌరిబాల ఆస్తమా వ్యాధి, నివారణ, చికిత్స తదితరాలు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దుమ్ము, ధూళి, పెంపుడు జంతువులు, ఇన్‌ఫెక్షన్‌లు, వాయు కాలుష్యం, పొగ, చల్లటి గాలి తదితరాలు ఆస్తమాకు కారణమవుతాయని, జాగ్రత్తలు తీసుకోవాలని రెగ్యులర్‌గా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ ఏడాది ఆస్తమా డే సందర్భంగా ఇచ్చిన నినాదాన్ని వివరించారు. మణిపాల్‌ ఆసుపత్రి కన్సల్టెంట్‌ పల్మనాలజిస్ట్‌ జి.లోకేష్‌ మాట్లాడుతూ ఆస్తమా అన్ని వ్యాధుల వారిని ప్రభావితం చేస్తుందని వివరించారు. ఈ సందర్భంగా ఆస్తమా వైద్య పరీక్షలకు వినియోగించే యంత్రాలను ప్రదర్శించారు. ఏసీఎంఎస్‌ డాక్టర్‌ ఎం.జయదీప్‌ వందన సమర్పణ చేశారు.

Updated Date - May 08 , 2024 | 12:40 AM