అర్జునుడు లేని లోటు టీడీపీకి తీర్చలేనిది
ABN , Publish Date - Mar 03 , 2024 | 12:44 AM
తెలుగుదేశం పార్టీకి, కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు లేని లోటు తీర్చలేనిదని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. మాజీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని టీడీపీ గన్నవరం నియోజకవర్గ కార్యాలయంలో శనివారం రాత్రి నిర్వహించారు.
గన్నవరం, మార్చి 2 : తెలుగుదేశం పార్టీకి, కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు లేని లోటు తీర్చలేనిదని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. మాజీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని టీడీపీ గన్నవరం నియోజకవర్గ కార్యాలయంలో శనివారం రాత్రి నిర్వహించారు. అర్జునుడు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీకేఆర్ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు, అనాథ పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ, టీడీపీకి అంకితభావంతో పనిచేసిన నాయకుడు బచ్చుల అని కొనియాడారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టిన ఆయన అరాచక శక్తులకు భయపడక ఎదురొడ్డి నిలిచి పార్టీని నిలబెట్టారని ప్రశంసించారు. అధికార పార్టీ వేధింపులను, దాడులను తట్టుకుని నిలబడి కార్యకర్తలకు అండగా ఉన్నారని, ఆయన లేని లోటు క్యాడర్‌కు తీర్చలేనిదన్నారు. బచ్చుల ఆస్పత్రిలో చికిత్స పొందు తుండగా టీడీపీ కార్యాల యంపై వైసీపీ గూండాలు దాడి చేసి ధ్వంసం చేశారని, ఆయన ఉంటే ఆ పరిస్థితి ఉండేది కాదన్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు, దొంతు చిన్న, చిరుమామిళ్ల సూర్యం, దయాల రాజేశ్వరరావు, గొడ్డళ్ల చిన రామారావు, గుజ్జర్లపూడి బాబూరావు, మోదుగుమూడి సత్యనారాయణ, కొండేటి వెంకటేశ్వరరావు, కొండ, సుధా కర్, సర్నాల బాలాజీ, మేడేపల్లి రమ, మండవ లక్ష్మి, చిక్కవరపు నాగమణి, మండవ రమ్య, పుట్టా సురేష్, లక్ష్మి సతీష్, సరిత, రాధికా, పాల్గొన్నారు.