Share News

పాఠ్యపుస్తకాలు సకాలంలో అందేనా?

ABN , Publish Date - May 22 , 2024 | 12:54 AM

2024-25 నూతన విద్యా సంవత్సరానికి సంబంధించి ఉమ్మడి కృష్ణాజిల్లాకు ఉచిత పాఠ్యపుస్తకాలు ఈ ఏడాది సకాలంలో ఎంతమేర సమకూరుస్తారనే అంశంపై సందిగ్ధత నెలకొంది. పాఠశాలల ప్రారంభానికి ఇంకా ఇరవై రోజులే ఉంది. విద్యార్థులు పాఠశాలకు వచ్చిన మొదటిరోజునే పాఠ్యపుస్తకాలు, విద్యాకానుక కిట్‌లను అందజేయాల్సి ఉంది. ఎన్నికల సమయం కావడంతో కొందరు టీచర్లు ఓట్ల లెక్కింపు విధుల్లో ఉంటారు. దీంతో ఈసారి పాఠ్యపుస్తకాల పంపిణీ ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

పాఠ్యపుస్తకాలు సకాలంలో అందేనా?

ఉమ్మడి జిల్లాకు కావాల్సిన పుస్తకాలు 17,44,487

1 నుంచి 7వ తరగతి వరకు కావాల్సిన వి 6,73,205

8 నుంచి 10వ తరగతి వరకు కావాల్సినవి 8,20,488

ఇప్పటికి వచ్చిన పుస్తకాలు 2,65,165, రావాల్సిన పుస్తకాలు 2,34,818

పూర్తిగా మారిన పదో తరగతి సిలబస్‌

2024-25 నూతన విద్యా సంవత్సరానికి సంబంధించి ఉమ్మడి కృష్ణాజిల్లాకు ఉచిత పాఠ్యపుస్తకాలు ఈ ఏడాది సకాలంలో ఎంతమేర సమకూరుస్తారనే అంశంపై సందిగ్ధత నెలకొంది. పాఠశాలల ప్రారంభానికి ఇంకా ఇరవై రోజులే ఉంది. విద్యార్థులు పాఠశాలకు వచ్చిన మొదటిరోజునే పాఠ్యపుస్తకాలు, విద్యాకానుక కిట్‌లను అందజేయాల్సి ఉంది. ఎన్నికల సమయం కావడంతో కొందరు టీచర్లు ఓట్ల లెక్కింపు విధుల్లో ఉంటారు. దీంతో ఈసారి పాఠ్యపుస్తకాల పంపిణీ ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : వచ్చే విద్యా సంవత్సరంలో ఉమ్మడి కృష్ణాజిల్లాకు అన్ని తరగతులకు కలిపి మొత్తంగా 17,44,487 పుస్తకాలు కావాలి. ఈ మేరకు ప్రభుత్వానికి విద్యాశాఖ అధికారులు ఇండెంట్‌ పెట్టారు. 1 నుంచి 7వ తరగతి వరకు కావాల్సిన వి 6,73,205 పుస్తకాలు. 8 నుంచి 10వ తరగతి వరకు కావాల్సిన పుస్తకాలు 8,20,488. ఇప్పటివరకు జిల్లాకు వచ్చిన పుస్తకాలు 2,65,165మాత్రమే. గతేడాదికి సంబందించి విద్యార్థులకు ఇవ్వగా మిగిలిన పుస్తకాలు 2,34,818 వరకు ఉన్నాయి. ఇంకా 12.44,487 పుస్తకాలు రావాల్సి ఉంది. మొదటి విడతగా జిల్లాకు 2,65,165 పాఠ్యపుస్తకాలు వచ్చాయని, మిగిలినవి రెండు రోజులకోసారి విజయవాడలోని గూడౌన్‌కు చేరుకుంటాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.

ఆర్టీసీతో ఒప్పందం

ఉమ్మడి కృష్ణాజిల్లాలో పాఠ్యపుస్తకాల రవాణాకు సంబంధించి ఆర్టీసీతో ఒప్పందం ఇప్పటికే కుదిరింది. మంగళవారం డీఈవో తాహెరా సుల్తానా మొదటి విడత పాఠ్యపుస్తకాల రవాణా ప్రక్రియను విజయవాడలో జెండా ఊపి ప్రారంభించారు. ఆర్టీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాల్లో జిల్లా కేంద్రానికి, మండల కేంద్రాలకు పాఠ్యపుస్తకాలను చేరవేస్తామని ఆమె తెలిపారు.

ఈ ఏడాదైనా పుస్తకాలు సక్రమంగా ఇచ్చేనా?

నాలుగు సంవత్సరాలుగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ చేయడంలో జాప్యం జరుగుతోంది. పాఠశాలలు తెరిచిన అనంతరం రెండు, మూడు నెలల పాటు పాఠ్యపుస్తకాలు అందజేయకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారు. రెండేళ్ల క్రితం జిల్లాలోని ఉర్దూ పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు అందకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇక్కట్లపాలయ్యారు.

పదో తరగతికి సీబీఎస్‌ఈ సిలబస్‌

ఈ విద్యాసంవత్సరం నుంచి నూతన పదో తరతగతిలో సీబీఎస్‌ఈ పద్ధతిలో పాఠ్యపుస్తకాలు ఉంటాయి. ఇక నుంచి 11 పరీక్షలు నిర్వహిస్తారని, ఈ అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. ఈసారి పదో తరగతిలో కామన్‌ పరీక్షలు లేకుండా విద్యార్థులను ఇంటర్మీడియట్‌కు పంపే అలోచన చేస్తున్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. పరీక్షలు ఎలా నిర్వహించినా పదో తరగతికి సంబంధించిన సిలబస్‌ మాత్రం ఈ ఏడాది మారిందని, పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావాలని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.

Updated Date - May 22 , 2024 | 12:54 AM