Share News

ఆర్థిక నేరస్థుడు జగన్‌

ABN , Publish Date - Jan 14 , 2024 | 01:27 AM

దేశంలోనే అతిపెద్ద ఆర్థిక నేరస్థుడు జగన్‌రెడ్డికి జన్మజన్మకు యావజ్జీవ శిక్ష తప్పదని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్‌ జేబు సంస్థ సీఐడీని అడ్డుపెట్టుకొని ప్రజల దృష్టిని మళ్లించేందుకు చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం, నీలి మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. పోరంకి టీడీపీ కార్యాలయంలో శనివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో బోడె ప్రసాద్‌ పార్టీ శ్రేణులతో పాల్గొని అధికార పార్టీ దుర్మార్గాలను ఎండగట్టారు.

 ఆర్థిక నేరస్థుడు జగన్‌
పోరంకి టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతున్న బోడె ప్రసాద్‌

పెనమలూరు, జనవరి 13 : దేశంలోనే అతిపెద్ద ఆర్థిక నేరస్థుడు జగన్‌రెడ్డికి జన్మజన్మకు యావజ్జీవ శిక్ష తప్పదని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్‌ జేబు సంస్థ సీఐడీని అడ్డుపెట్టుకొని ప్రజల దృష్టిని మళ్లించేందుకు చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం, నీలి మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. పోరంకి టీడీపీ కార్యాలయంలో శనివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో బోడె ప్రసాద్‌ పార్టీ శ్రేణులతో పాల్గొని అధికార పార్టీ దుర్మార్గాలను ఎండగట్టారు. తీవ్ర నేరారోపణలకు సంబంధించిన 338 కేసుల్లో 43వేల కోట్ల దోపిడీపై సీబీఐ ఈడీకూడా ఛార్జిషీట్లు వేసిన విషయాలను గుర్తు చేశారు. కేసులకు సంబంధించి 3500 వాయిదాలను తీసుకోవడం దారుణమైన విషయమని వ్యాఖ్యానించారు. శిక్ష పడుతుందనే విషయం నిర్థారణతోనే కోర్టులకు హాజరు కాకుండా వాయిదాలు తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎటు వంటి ఆర్థిక ప్రయోజనం పొందలేదని, దీనికి సంబంధించిన ఒక్క ఆధారాఇ్న సీఐడీ చూపలేకపోయిందని విమర్శించారు. 16 నెలలు జైలులో ఉండి కుటుంబ ఆస్థులు జప్తు చేయడం ప్రజ లు ఇంకా మర్చిపోలేదని వ్యాఖ్యానించారు. తీవ్రమైన ఆర్థిక నేరాల్లో బెయిల్‌ ఇచ్చే సమయంలో కోర్టు ఆరోపణల స్వభావాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొనడాన్ని బట్టి జగన్‌ నేరాల తీవ్రతను అర్థం చేసుకోవచ్చని బోడె పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు అనుమోలు ప్రభాకరరావు, వెలగపూడి శంకరబాబు, మారుపూడి ధనకోటేశ్వరరావు, కోయ ఆనంద్‌ ప్రసాద్‌, సంగెపు రంగారావు, కుర్రా నరేంద్ర, తోటకూర ఉదయభాస్కర్‌, ముసునూరు శ్రీనివాసరావు, శ్రీధర్‌, బోడె సురేంద్ర, తుమ్మల రాంకుమార్‌, షేక్‌ షకీలా, మల్లంపాటి విజయలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - Jan 14 , 2024 | 01:27 AM