Share News

ఓటరూ.. కర్తవ్య నిర్వహణలో పాలుపంచుకో

ABN , Publish Date - Mar 22 , 2024 | 12:55 AM

ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం.. అమూల్యమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడిన వాళ్లం అవుతాం. కొత్తగా ఓటు హక్కు సాధించిన నవ ఓటర్లతో పాటు, ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ఓటు హక్కు విషయంలో అత్యంత బాధ్యతాయుతంగా ఉండాలి. ఓటరు స్పృహతో కర్తవ్యాలను నిర్వర్తించాలి.

ఓటరూ.. కర్తవ్య నిర్వహణలో పాలుపంచుకో

(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం.. అమూల్యమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడిన వాళ్లం అవుతాం. కొత్తగా ఓటు హక్కు సాధించిన నవ ఓటర్లతో పాటు, ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ఓటు హక్కు విషయంలో అత్యంత బాధ్యతాయుతంగా ఉండాలి. ఓటరు స్పృహతో కర్తవ్యాలను నిర్వర్తించాలి. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించటంలో భాగంగా ఎన్నికల సంఘం పలు మొబైల్‌ యాప్‌లను అందుబాటులోకి తెచ్చింది. వాటిలో ముఖ్యమైన నాలుగు యాప్‌ల గురించి తెలుసుకుందాం. ఈ యాప్‌లను ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యూజర్లు గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

సీ విజిల్‌

ఈ యాప్‌ ఒక రకంగా ఓటర్ల గ్రీవెన్స్‌, ఫిర్యాదులు స్వీకరిస్తుంది. ప్రస్తుతం అమల్లోకి వచ్చిన మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ మొదలుకొని ఎన్నికలు, ఫలితాలు ప్రకటించే వరకు ఎలాంటి ఫిర్యాదులనైనా ఎన్నికల సంఘం దృష్టికి ఓటర్లు నేరుగా ఈ యాప్‌ ద్వారా తీసుకు రావచ్చు. ఎక్కడైతే అక్రమాలు జరిగాయో.. జీపీఎస్‌ లొకేషన్‌ను ఈ యాప్‌ ద్వారా పంపించవచ్చు. ఒక్కోసారి ప్రత్యక్షంగా కళ్లెదుట జరిగే సంఘటనలు కూడా ఎన్నికల సంఘం దృష్టికి ఈ యాప్‌ ద్వారా తీసుకువెళ్లవచ్చు. మీ వివరాలు అత్యంత రహస్యంగా ఉంటాయి. మీ ఫిర్యాదు ఏ స్థితిలో ఉందో కూడా ట్రాక్‌ చేసి తెలుసుకోవచ్చు.

ఓటర్‌ హెల్ప్‌ లైన్‌

ఈ యాప్‌ ద్వారా ఓటర్ల జాబితాలో మీ పేరు ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. ఒటరు రిజిస్ర్టేషన్‌ను మార్చుకోవచ్చు. ఎన్నికల సంబంధిత సమాచారాన్ని ఈ యాప్‌ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అలాగే ఫిర్యాదులను కూడా యాప్‌ ద్వారా చేయవచ్చు.

సాక్షం

ఈ మొబైల్‌ యాప్‌ ద్వారా దివ్యాంగులు సహాయాన్ని పొందవచ్చు. ఓటు హక్కు వినియోగించుకోవటానికి ముందుగానే ఈ యాప్‌ ద్వారా మీకు ఎలాంటి సహాయం కావాలో కోరవచ్చు. మాటలు వినలేని వారు తమను సంభాషించగలిగే వారి సహాయాన్ని కోరవచ్చు. చూపు తక్కువ కలిగిన వారు కూడా బ్యాలెట్‌ పేపర్‌ను చక్కగా చూడలిగే విధంగా ఫాంట్లు పెద్దవి చయటం, కోరిన మీదట రంగులు హైలెట్‌ చేయటం వంటివి చేస్తారు. పోలింగ్‌ కేంద్రాల సమాచారం గురించి తెలుసుకోవచ్చు. వీల్‌చెయిర్‌ సహాయాన్ని కూడా పొందవచ్చు. ఏదైనా ఫిర్యాదులు ఉన్నా చేయవచ్చు.

కేవైసీ

ఈ మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా ఎన్నికలలో పాల్గొనే అభ్యర్థుల పేర్లను, అభ్యర్థుల క్రిమినల్‌ కేసులు గురించి తెలుసుకోవచ్చు. అలాగే అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ల గురించి, అందులోని సమాచారం తెలుసుకోవచ్చు.

Updated Date - Mar 22 , 2024 | 12:55 AM