ఏఆర్ కాలనీ వాసుల ఆందోళన
ABN , Publish Date - Feb 08 , 2024 | 01:16 AM
తమ కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కా రంలో ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యంపై గంగూరు పంచాయతీ ఏఆర్ నగర్ కాలనీ వాసులు మంగళవారం రాత్రి నుంచి ఆందోళన చేపట్టి బుధవారం మధ్యాహ్నం వరకు కొనసాగించారు.
పెనమలూరు, ఫిబ్రవరి 7 : తమ కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కా రంలో ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యంపై గంగూరు పంచాయతీ ఏఆర్ నగర్ కాలనీ వాసులు మంగళవారం రాత్రి నుంచి ఆందోళన చేపట్టి బుధవారం మధ్యాహ్నం వరకు కొనసాగించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడు తూ, తమ కాలనీలో మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని గత ఎన్నికల్లో వైసీపీ నాయకులు ఊదరగొట్టగా నమ్మి గుంపగుత్తగా ఓట్లేశామని, గెలిచిన ప్రజా ప్రతినిధులు తమ కాలనీలో సౌకర్యాలు కల్పించకపోగా ఎప్పటి నుంచో ఉన్న పంచాయతీ కార్యాలయాన్ని వేరే చోటకు తరలించారని, ఏభై ఏళ్ల కిందట నిర్మించిన మంచినీటి ట్యాంకు శిథిలావస్థకు చేరిందని, తాగునీటికి ఇబ్బందులు పడుతున్నా మని, కాలనీలో షుమారు ఏభై మంది చిన్న పిల్లలు ఉండగా ఇక్కడ ఇంత వరకు అంగన్‌వాడీ భవనం నిర్మించలేదని, గతంలో కాలనీలోని చర్చి ఆవరణలో తాత్కాలికంగా నడిచిన ప్రాథమిక పాఠశాలను మరో చోటికి తరలించడంతో దూర ప్రాం తాలకు పిల్లలు వేళాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాలనీలో ఉన్న సచివాలయంలో తమ వివరాలు లేవని, కాలనీకి చెందిన 50మందికి మాత్రమే వణుకూరులో ఇళ్లస్థలాలు ఇచ్చారని, అర్హులైన వందమందికి పైగా ఇవ్వాల్సి ఉం డగా పట్టించుకోవడం లేదన్నారు. తాము ఇంత ఆందోళన చేస్తున్నా, అధికా రులు, ప్రజాప్రతినిధులు స్పందించికపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.