ఏపీఎస్‌ఈబీ సర్వీస్ రెగ్యులేషన్ చేయండి
ABN , Publish Date - Jul 21 , 2024 | 12:41 AM
విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఎనర్జీ అసిస్టెంట్(జేఎల్‌ఎం గ్రేడ్-2) అందరికీ ఏపీఎస్‌ఈబీ సర్వీస్ రెగ్యులేషన్ వర్తింపచేసి, అసిస్టెంట్ లైన్‌మెన్ ప్రమోషన్లు కల్పించే విధంగా కృషి చేయాలని యూనియన్ నాయకులు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ను కోరారు.
ఏపీఎస్‌ఈబీ సర్వీస్ రెగ్యులేషన్ చేయండి
ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌కు విద్యుత్ ఉద్యోగుల వినతి
పటమట, జూలై 20: విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఎనర్జీ అసిస్టెంట్(జేఎల్‌ఎం గ్రేడ్-2) అందరికీ ఏపీఎస్‌ఈబీ సర్వీస్ రెగ్యులేషన్ వర్తింపచేసి, అసిస్టెంట్ లైన్‌మెన్ ప్రమోషన్లు కల్పించే విధంగా కృషి చేయాలని యూనియన్ నాయకులు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ను కోరారు. అశోక్‌నగర్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంలో విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఎనర్జీ అసిస్టెంట్ ఉద్యోగులు, సీఐటీయూ అనుబంధ సంస్థ యునైటెడ్ ఎలక్ర్టిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా నాయకులు తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ను కలిశారు. ఈ సందర్భంగా గద్దె మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులు తెలియజేసిన అంశాలను ముఖ్యమంత్రి చంద్ర బాబుకు, విద్యుత్‌శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానని హామీ ఇచ్చారు.
మూడో డివిజన్‌లో గద్దె పర్యటన
గుణదల: స్థానిక 3వ డివిజన్ విజయలక్ష్మి కాలనీలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శనివారం పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చిన్నపాటి వర్షానికి రోడ్లు జలమయం అయిపోతున్నాయని స్థానికులు గద్దెకు వివరించారు. ఈ ప్రాంతంలో గంజాయి మత్తులో కొంతమంది మహిళలను అసభ్యకరపదజాలంతో దూషిస్తూ గొడవలు చేస్తున్నారని వివరించారు. దానికి సానుకూలంగా స్పందించిన ఆయన చంద్రబాబు నాయుడు గంజాయు అనే మాట రాష్ట్రంలో వినపడకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఉడా మాజీ చైర్మన్ తూమాటి ప్రేమనాథ్, కార్పొరేటర్ ప్రసాద్, యలమంచలి రాజేంద్రప్రసాద్, జయశంకర్, శ్రీనివాస్, కొర్రపాటి సురేంద్ర, చలసాని రమణ, కోడూరు ఆంజనేయ వాసు పాల్గొన్నారు.