బాణాసంచా దుకాణాలకు దరఖాస్తులు
ABN , Publish Date - Oct 25 , 2024 | 01:12 AM
దీపావళి సందర్భంగా నగరంలో బాణాసంచా దుకాణాలు ఏర్పాటు చేసేందుకు లైసెన్స్ కలిగిన వ్యాపారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురు వారం ఒక ప్రకటనలో తెలిపారు.

వన్‌టౌన్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): దీపావళి సందర్భంగా నగరంలో బాణాసంచా దుకాణాలు ఏర్పాటు చేసేందుకు లైసెన్స్ కలిగిన వ్యాపారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురు వారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 29వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మూడు రోజులు విద్యాధరపురం లేబర్ కాలనీలో స్టేడియం కొరకు కేటాయించిన స్థలం, సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య మునిసిపల్ కార్పొరేషన్ స్టేడి యంలో బాణసంచా విక్రయ స్టాల్స్ ఏర్పాటు చేసుకొనుటకు విక్రయదారులు దర ఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. బాణసంచా విక్రయ స్టాల్స్ ఏర్పాటు చేసుకొనుటకు ఈనెల 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మధ్యాహ్నం 2 గంటల వరకు కార్యాలయం పనివేళల్లో దరఖాస్తులు పొంది, దాఖలు చేసుకోవాలని ఆయన సూచించారు. అక్టోబరు 28న మధ్యాహ్నం 3 గంటలకు దరఖాస్తుదారుల సమక్షంలో లాటరీ పద్ధతిలో స్టాల్స్ కేటాయిస్తామని వీఎంసీ కమిషనర్ ద్యానచంద్ర పేర్కొన్నారు.