Share News

అందుబాటులో ఉంటా.. ఆదరించండి

ABN , Publish Date - Feb 25 , 2024 | 01:11 AM

నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని రానున్న సార్వ త్రిక ఎన్నికల్లో తనను ఆదరించాలని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ అన్నారు. కంకిపాడు మండలంలోని మద్దూరుకు చెందిన వైసీపీ నాయకులు ఆరేపల్లి రవి కుటుంబ సభ్యులు, వైసీపీ వార్డు సభ్యులు పెద్ద సంఖ్యలో బోడె ప్రసాద్‌ సమక్షంలో శనివారం తెలుగుదేశం పార్టీలో చేరారు.

 అందుబాటులో ఉంటా.. ఆదరించండి
బోడె ప్రసాద్‌ సమక్షంలో శనివారం తెలుగుదేశం పార్టీలో చేరారు.

మద్దూరు (కంకిపాడు), ఫిబ్రవరి 24 : నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని రానున్న సార్వ త్రిక ఎన్నికల్లో తనను ఆదరించాలని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ అన్నారు. కంకిపాడు మండలంలోని మద్దూరుకు చెందిన వైసీపీ నాయకులు ఆరేపల్లి రవి కుటుంబ సభ్యులు, వైసీపీ వార్డు సభ్యులు పెద్ద సంఖ్యలో బోడె ప్రసాద్‌ సమక్షంలో శనివారం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బోడె ప్రసాద్‌ మాట్లాడుతూ, అధికారంలో ఉన్న ఐదేళ్లు.. ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్లు నియోజకవర్గ ప్రజలకు అందు బాటులో ఉంటూ వచ్చానన్నారు. వలస వచ్చిన ప్రతిపక్ష పార్టీ నాయకులను నమ్మి మోసపోవద్దన్నారు. తనను గెలిపించిన ఏడాది లోపే మద్దూరు - ఉప్పలూరు ప్రధాన రహదారి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో డ్రెయినేజీ ప్రధాన రహదారుల అభివృద్ధి కూడా చేసి చూపిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గొంది శివరామకృష్ణ ప్రసాద్‌, పార్టీ మండల అధ్యక్షుడు సుదిమళ్ల రవీంద్ర, యనమదల మదన్‌ మోహన్‌, యనమదల చిన్ని, వల్లభనేని నవీన్‌, వీరంకి బాలకృష్ణ, మన్నే వాసు, మాజీ సర్పంచ్‌ వల్లే నరసింహారావు, తీట్ల మధు, పామర్తి నాని తదితరులు పాల్గొన్నారు.

టీడీపీని బలపరచండి

పెనమలూరు : ఐదేళ్లుగా అభివృద్ధిలో వెనుకబడిన రాష్ర్టాన్ని బాగుచేసుకోవడానికి వచ్చే ఎన్నికల్లో టీడీపీని బలపరచమని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ సతీమణి హేమ పిలుపునిచ్చారు. శనివారం యనమలకుదురులో జరిగిన బాబు ష్యూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో ఆమె స్థానిక నాయకులతో కలిసి ప్రజలతో మాట్లాడారు. అవినీతి, నిరుద్యోగం, రైతుల, కార్మికుల ఆత్మహత్యలు జగన్‌రెడ్డి హయాంలో ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. బాబు ష్యూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీ కరపత్రాలను పంపిణీ చేశారు. టీడీపీ జనసేన మేనిఫెస్టో వల్ల రాష్ట్ర ప్రజలకు అత్యంత ఎక్కువ మేలు జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో అనంతనేని ఆజాద్‌, మొక్కపాటి శ్రీనివాస్‌, ఇబ్రహీం, తమ్ము అశోక్‌, బలగం నాగరాజు, గోగినేని రామారావు, ధనేకుల షణ్ముఖరావు, బలగం కొండ, పండల రజిని, కందుల శివ, మల్లంపాటి విజయలక్ష్మి, బూక్యా బిచాలి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 25 , 2024 | 01:12 AM