Share News

ఆకట్టుకున్న మాక్‌డ్రిల్‌

ABN , Publish Date - Jun 02 , 2024 | 12:19 AM

ఎన్నికల ఫలితాలను దృష్టి లో ఉంచుకుని గన్నవరం పోలీసులు గాంధీబొమ్మ సెంటర్‌లో శనివారం మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. ఇందులో భాగంగా పోలీసులు ఒక రాజకీయ పార్టీ నాయకుడిని అరెస్టు చేశారు. అతనిని విడిపించాలని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు గాంధీబొమ్మ సెంట ర్‌ దగ్గర ఆందోళన చేపట్టారు.

 ఆకట్టుకున్న మాక్‌డ్రిల్‌
భాష్పవాయువును ప్రయోగించి మంటలను అదుపు చేస్తున్న పోలీసులు

ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసిన పోలీసులు

గన్నవరం, జూన్‌ 1 : ఎన్నికల ఫలితాలను దృష్టి లో ఉంచుకుని గన్నవరం పోలీసులు గాంధీబొమ్మ సెంటర్‌లో శనివారం మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. ఇందులో భాగంగా పోలీసులు ఒక రాజకీయ పార్టీ నాయకుడిని అరెస్టు చేశారు. అతనిని విడిపించాలని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు గాంధీబొమ్మ సెంట ర్‌ దగ్గర ఆందోళన చేపట్టారు. అధికసంఖ్యలో పార్టీ శ్రేణులు ఉండటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళన కారులు టైర్లుకాల్చి విధ్వంసానికి పాల్పడేందుకు కుట్ర పన్ను తున్నారు. విషయం తెలుసుకున్న గన్నవరం సీఐ ప్రసాద్‌ వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అధికార బృందం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితి అదుపు తప్పుతుందని గ్రహించిన అధికారులు సివిల్‌, ఏఆర్‌ పోలీసు లను, అగ్నిమాపక వాహనం, వైద్య అధికారులు, సిబ్బం దిని పిలిపించారు. ఆందోళనకారులను వెనక్కి వెళ్లాలని హెచ్చ రికలు జారీ చేశారు. ఆందోళనకారులు టైర్లు కాల్చి రాళ్లు విసి రారు. పోలీసులు భాష్పవాయువును ప్రయోగించి మంటలను అదుపు చేశారు. ఆందోళన కారులను చెదరగొట్టేందుకు గాలిలో కాల్పులు జరిపారు. అప్పటికి రాళ్లు రువ్వటంతో లాఠీఛార్జ్‌ చేసి ఆందోళన కారులను చెదరగొట్టారు. ఈ లాఠీ ఛార్జ్‌లో పలువురు గాయపడటంతో అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఇలా పోలీసులు ముందుగా ప్రజలని అప్రమత్తం చేశారు.

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే తగిన చర్యలు తప్పవని గన్నవరం నియోజకవర్గ ప్రత్యేక పోలీస్‌ అధికారి ఎస్పీ కె.ఈశ్వర్‌ రావు అన్నారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ 144సెక్షన్‌ అమల్లో ఉందని చెప్పారు. ఎన్నికల ఫలితాల రోజు ఎవరైన అల్లర్లు సృష్టించినా, గొడవలకు పాల్పడినా, సహించేది లేదని హెచ్చరించారు. ఏఆర్‌ అదనపు ఎస్పీ ఎస్‌వీడీ ప్రసాద్‌, డీఎస్పీ జయసూర్య, సీఐలు కెవిఎస్‌వి ప్రసాద్‌, నవీన్‌ నరసింహమూర్తి, పెద్దురాజు, ఎస్సైలు కనకదుర్గ, రవిచంద్ర, పూడిబాబు తదితరులు పాల్గొన్నారు.

అలజడులు సృష్టిస్తే ..

ఉంగుటూరు : ఓట్ల లెక్కింపు రోజు గ్రామాల్లో శాంతియుత వాతావరణానికి భంగం కలిగించే విధంగా ఎవరైనా అల్లర్లు, అలజడులు సృష్టిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆత్కూరు ఎస్సై ఏ.పైడిబాబు హెచ్చరించారు. తేలప్రోలులోని జోసఫ్‌ నగర్‌లో శనివారం విజిబుల్‌ పోలీసింగ్‌ కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2024 | 12:19 AM