Share News

మున్సిపల్‌ కార్మికుల ఆందోళన

ABN , Publish Date - Feb 07 , 2024 | 12:58 AM

కార్మికుల సమ్మెకాలపు ఒప్పందాల జీవో జారీలో ప్రభుత్వం జాప్యంపై మునిసిపల్‌ కార్మికులు కార్యాలయం వద్ద మంగళవారం నిరసన తెలిపారు.

మున్సిపల్‌ కార్మికుల ఆందోళన
తిరువూరు మునిసిపల్‌ కార్యాలయం వద్ద కార్మికుల నిరసన

తిరువూరు, ఫిబ్రవరి 6: కార్మికుల సమ్మెకాలపు ఒప్పందాల జీవో జారీలో ప్రభుత్వం జాప్యంపై మునిసిపల్‌ కార్మికులు కార్యాలయం వద్ద మంగళవారం నిరసన తెలిపారు. సమ్మె కాలానికి వేతనం ఇస్తామని, డ్రైవర్లను డ్రైవర్లుగా గుర్తిస్తామని, ఐసీఎస్‌ అధికారుల కమిటీ ఆధారంగా ఇంజనీరింగ్‌ విభాగం కార్మికలు సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కరోనా ఇతర సందర్భాల్లో అదనపు కార్మికులుగా తీసుకున్న వారందరిని విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చిన ప్రభుత్వం నేడు పట్టించుకోవడం లేదన కార్మికులు ఆరోపించారు. తక్షణం మునిసిపల్‌ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని లేనిపక్షంలో ఉద్యమం చేస్తామన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి బి.వెంకటేశ్వరరావు, మునిసిపల్‌ యూనియన్‌ నాయకులు చాపలమడుగు నాగరాజు, మారెపోగు నాగరాజు, శ్రీను, బాబురావు, రమణ నాగభూషిపాల్గొన్నారు.

నందిగామ: న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేసిన సందర్భంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు తక్షణమే నెరవే ర్చాలని మునిసిపల్‌ కార్మికులు కోరారు. మంగళవారం ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరు తూ కమిషనర్‌ కె.హేమమాలినికి వినతి పత్రం అందజేశారు.

Updated Date - Feb 07 , 2024 | 12:58 AM