Share News

సిద్ధార్థ మహిళా కళాశాలలో ఘనంగా అచీవర్స్‌ డే

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:51 AM

సివిల్‌ సర్వీస్‌ ఎగ్జామ్‌లో రైటింగ్‌ పార్ట్‌ చాలా ముఖ్యమైనదని ప్రిలిమినరీస్‌ దగ్గర నుంచి మెయిన్స్‌ వరకు నిరంతరం శ్రమిస్తే గమ్యం చేరుకోగలుగుతారని జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ వి. మణి చైతన్య అన్నారు.

సిద్ధార్థ మహిళా కళాశాలలో ఘనంగా అచీవర్స్‌ డే

సిద్ధార్థ మహిళా కళాశాలలో ఘనంగా అచీవర్స్‌ డే

లబ్బీపేట, ఏప్రిల్‌19: సివిల్‌ సర్వీస్‌ ఎగ్జామ్‌లో రైటింగ్‌ పార్ట్‌ చాలా ముఖ్యమైనదని ప్రిలిమినరీస్‌ దగ్గర నుంచి మెయిన్స్‌ వరకు నిరంతరం శ్రమిస్తే గమ్యం చేరుకోగలుగుతారని జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ వి. మణి చైతన్య అన్నారు. సిద్ధార్థ మహిళా కళాశాలలో శుక్రవారం అచీవర్స్‌ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను సివిల్‌ సర్వీస్‌ ఎగ్జామ్‌లో అచీవ్‌ అవడానికి ఎంతో కష్టపడి శ్రమించానని, 9 గంటలు చదివితేనే సివిల్స్‌ పాస్‌ అవగలమని అందుకు డిగ్రీ స్థాయి నుంచి ఇంగ్లీషు, తెలుగు న్యూస్‌ పేపర్‌, మ్యాగ్‌జైన్స్‌ పఠనం ముఖ్యమని వివరించారు. విద్యార్థులకు పట్టుదల, కృషి ఎంతో అవసరమని అన్నారు. ఈ సందర్భంగా ప్రాంగణ ఎంపికల్లో, పలు పోటీల్లో అచీవ్‌ అయిన విద్యార్థినులను అభినందించి వారికి సర్టిఫికెట్లు, షీల్డ్స్‌ అందజేశారు. కళాశాల డైరెక్టర్‌ టి.విజయలక్ష్మీ, ప్రిన్స్‌పాల్‌ ఎస్‌.కల్పన పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2024 | 12:51 AM