అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ABN , Publish Date - Nov 02 , 2024 | 12:51 AM
నియోజకవర్గంలో షుమారు రూ. 50 కోట్లతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తునట్టు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. గండిగుంటలో రెండు సీసీ రోడ్ల నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ చేశారు.
ఉయ్యూరు, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి) : నియోజకవర్గంలో షుమారు రూ. 50 కోట్లతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తునట్టు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. గండిగుంటలో రెండు సీసీ రోడ్ల నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ఆ దిశగా చర్యలు చేపట్టారన్నారు. ముందుగా గండిగుంటలో ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీలో బోడె ప్రసాద్, సర్పంచ్ గెత్తం అనుపమ, టీడీపీ నాయకులు సాంబశివరావు, వి. సత్యనా రాయణ, ప్రవీణ్, ఎంపీడీవో శేషగిరిరావు పాల్గొన్నారు.
కంకిపాడు : ఇచ్చిన మాటకు కట్టుబడి నెల రోజుల్లో రోడ్డు అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన ఘనత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కే దక్కిందని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. మండల కేంద్రమైన కంకిపాడు - రొయ్యూరు వయా గొడవర్రు రోడ్డుకు రూ. 3.75 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆయన శుక్రవారం శంకు స్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అనూష, పీఆర్ డీఈ శ్రీనివాస్, ఏఈ వెంకటేశ్వరరావు, ఎంపీపీ నెరుసు రాజ్యలక్ష్మి, టీడీపీ సీనియర్ నాయకులు తుమ్మలపల్లి హరికృష్ణ, మండల పార్టీ అధ్యక్షుడు సుదిమళ్ల రవీంద్ర, జనసేన పార్టీ సమన్వయకర్త ముప్పా రాజ, స్థానిక టీడీపీ నాయకులు బోసు, కోనేరు సాంబశివరావు, నాని, కోనేరు రాజేష్, వెంకటేశ్వరరావు, వణుకూరు విక్రం, ఏనుగ జయప్రకాష్ పాల్గొన్నారు.