అభివృద్ధే ప్రధాన లక్ష్యం
ABN , Publish Date - Jul 08 , 2024 | 12:49 AM
ఎన్నికల వరకే రాజకీయాలు అని ఆతరువాత నియోజకవర్గ అభివృద్ధే ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. కంకిపాడు మండలం లోని మారేడుమాక గ్రామంలో రూ. 6.60 కోట్లతో ఏర్పాటు చేసిన 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు.

మారేడుమాక (కంకిపాడు), జూలై 7 : ఎన్నికల వరకే రాజకీయాలు అని ఆతరువాత నియోజకవర్గ అభివృద్ధే ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. కంకిపాడు మండలం లోని మారేడుమాక గ్రామంలో రూ. 6.60 కోట్లతో ఏర్పాటు చేసిన 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ, రాజకీయాల్లో చేరిన కొత్త తరంలోనే తన సొంత డబ్బుతో మారేడుమాక - మాని కొండ డొంక రోడ్డు అభివృద్ధికి తన వంతు కృషి చేయడం జరిగిందన్నారు. 2014 నుంచి 2019 మధ్యలో తెలుగుదేశం పార్టీ హయాం లో రోడ్లు, డ్రెయిన్లు అభివృద్ధికి అత్యఽ దిక శాతం నిధులు కేటాయించి అభివృద్ధి చేయ డం జరిగిందని, అదే విధంగా సబ్‌స్టేషన్ నిర్మా ణానికి అవసరమైన స్థలాన్ని సూరప నేని రామబ్రహ్మం, పూర్ణచంద్రరావు, గంగా దర్‌రావు, విజయ నాగేశ్వరరావు, శ్రీనివాస రావు, ఎస్ నాగకృష్ణమురళి అందించార న్నారు. ఈ సందర్భంగా వారిని బోడె ప్రసాద్ అభినందించారు. ఈ సబ్ స్టేషన్ ఏర్పాటుతో మండలంలోని మంతెన, తెన్నేరు, జగన్నాధపురం, కోమటిగుంట, ఉంగుటూరు మండలం బొకినాల గ్రామాల ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం జరు గుతుందని విద్యుత్ శాఖ ఏఈ అశోక్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నెరుసు రాజ్యలక్ష్మి, విద్యుత్ శాఖ ఎస్సీ మురళీమోహన్, ఈఈ పి. హరిబాబు, ఏడీఈ బి. నవీన్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వెలగపూడి శంకరబా బు, జనసేన నియోజ కవర్గ సమన్వయకర్త ముప్పా రాజా, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్లు మద్దాలి రామచంద్ర రావు, సుదిమళ్ల రవీంద్ర, అన్నే ధనయ్య, మద్దాలి సాయిబాబు, కొండవీటి శివయ్య, సూరప నేని మురళి, యార్లగడ్డ రాజా, ఊసల రామయ్య, వీర్ల వీరబాబు, కె. నాగలింగం, వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.