Share News

ఆటోను ఢీకొన్న లారీ

ABN , Publish Date - Mar 01 , 2024 | 12:51 AM

పామర్రు-గుడివాడ ప్రధాన రహదారిపై అడ్డాడ వద్ద ఆగి ఉన్న ఆటోను వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొన్న ఘటనలో మహిళ అక్కడిక్కడే మృతిచెందింది.

ఆటోను ఢీకొన్న లారీ

మహిళ మృతి..నలుగురికి గాయాలు

పామర్రు, ఫిబ్రవరి 29: పామర్రు-గుడివాడ ప్రధాన రహదారిపై అడ్డాడ వద్ద ఆగి ఉన్న ఆటోను వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొన్న ఘటనలో మహిళ అక్కడిక్కడే మృతిచెందింది. నలుగురికి గాయా లయ్యాయి. గురువారం పామర్రు నుంచి గుడివాడకు ప్రయాణికులతో వెళ్తున్న ఆటో అడ్డాడ వద్ద ప్రయా ణికులను ఎక్కించుకుంటుండగా అదే దిశలో వచ్చిన లారీ వెనుక నుంచి ఢీకొంది. ఆటోలో ఉన్న దేవర కొండ యశోద(58) అక్కడికక్కడే మృతిచెందింది. ఆటోడ్రెవర్‌తో పాటు మరో ముగ్గురికి గాయాల య్యాయి. ఏఎస్సై జి.రాజ్‌కుమార్‌ కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.

Updated Date - Mar 01 , 2024 | 12:51 AM