రామవరప్పాడు వంతెన నుంచి రింగ్ వరకు ఫీడర్ రోడ్డు వేయాలి
ABN , Publish Date - Jan 08 , 2024 | 01:21 AM
‘‘రామవరప్పాడు, ప్రసాదంపాడు గ్రామాల్లో కాల్వకట్లపై నివాసాలు ఉండే 40 వేల మంది రామవరప్పాడు వంతెన వద్ద నుంచి జాతీయ రహదారిపైకి ఎక్కాలంటే సరైన మార్గం లేదు. కట్లపై నివా సాలు ఉండేవారంతా నగరంలోకి వెళ్లడానికి జాతీయరహదారిపై రామవర ప్పాడు రింగ్ రోడ్డు వరకు ఎదురు వన్‌వేలో వెళ్లాల్సి వస్తోంది. అనేకమార్లు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్డుపై నుంచి వచ్చే వాహనాలు జాతీయరహదారిపైకి వచ్చేందుకు వీలుగా ఏర్పాటు చేసిన రోడ్డు కాకుండా ఇంకా చాలా స్థలం ఖాళీగా ఉంది. ఆ స్థలంలో రామవర ప్పాడు వంతెన సెంటర్ నుంచి రామవరప్పాడు రింగ్ రోడ్డు వరకు రైవస్ కాల్వ వెంబడి ఫీడర్ రోడ్డు ఏర్పాటు చేయాలి.’’ అని టీడీపీ విజయవాడ రూరల్ మండల మాజీ అధ్యక్షుడు కొల్లా ఆనంద్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గుణదల, జనవరి 7: ‘‘రామవరప్పాడు, ప్రసాదంపాడు గ్రామాల్లో కాల్వకట్లపై నివాసాలు ఉండే 40 వేల మంది రామవరప్పాడు వంతెన వద్ద నుంచి జాతీయ రహదారిపైకి ఎక్కాలంటే సరైన మార్గం లేదు. కట్లపై నివా సాలు ఉండేవారంతా నగరంలోకి వెళ్లడానికి జాతీయరహదారిపై రామవర ప్పాడు రింగ్ రోడ్డు వరకు ఎదురు వన్‌వేలో వెళ్లాల్సి వస్తోంది. అనేకమార్లు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్డుపై నుంచి వచ్చే వాహనాలు జాతీయరహదారిపైకి వచ్చేందుకు వీలుగా ఏర్పాటు చేసిన రోడ్డు కాకుండా ఇంకా చాలా స్థలం ఖాళీగా ఉంది. ఆ స్థలంలో రామవర ప్పాడు వంతెన సెంటర్ నుంచి రామవరప్పాడు రింగ్ రోడ్డు వరకు రైవస్ కాల్వ వెంబడి ఫీడర్ రోడ్డు ఏర్పాటు చేయాలి.’’ అని టీడీపీ విజయవాడ రూరల్ మండల మాజీ అధ్యక్షుడు కొల్లా ఆనంద్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రామవరప్పాడు వంతెన సెంటర్ వద్ద ఫీడర్ రోడ్డు ఏర్పాటు చేయాలని కోరుతూ పార్టీలకు అతీతంగా గ్రామస్థులు ఆదివారం నిరసన తెలిపారు. ఆక్రమణలు వద్దు రహదారులు ముద్దు అంటూ నినా దాలు చేశారు. స్థానికులే కాకుండా రామవరప్పాడులో ఉన్న రైల్వేస్టేషన్‌కు వచ్చేవారు సరైన మార్గం లేక చాలా ఇబ్బంది పడుతున్నారని, ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణ సమయంలో ఖాళీ చేయించిన స్థలాల్లో నేడు ఆక్రమణలు జరుగుతున్నా పట్టించుకునే వారే లేరని టీడీపీ రామవరప్పాడు గ్రామ అధ్య క్షుడు నబిగాని కొండ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరిగేషన్ స్థలంలో కృష్ణుడి గుడి, కల్యాణమండపం అని ఒకరు, మరొకరు కార్మిక సంఘం కార్యాలయం, ఇంకొకరు అయ్యప్పస్వామి ఆలయం అని నిర్మాణాలు చేసుకుంటూ పోతే సమస్యకు పరిష్కారం దొరకదన్నారు. అనంతరం పటమట ఎస్‌ఐకు వినతి పత్రం సమర్పించారు. జనసేన, టీడీపీ నేతలు గూడవల్లి నరసయ్య, బొప్పన హరికృష్ణ, సర్నాల బాలాజి, అద్దేపల్లి సాంబశివనాగరాజు, కొంగన రవి, పరు చూరి నరేష్, ఇజ్జి రామారావు, సుభాషిణి, ఇరుగ్రామాల ప్రజలు పాల్గొన్నారు.