Share News

వెలంపల్లి ఒత్తిడితోనే బుద్దా వెంకన్నపై కేసు పెట్టా: మైలవరపు దుర్గారావు

ABN , Publish Date - Nov 25 , 2024 | 12:37 AM

వైసీపీ హయాంలో ఆనాటి మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను సవాల్‌ చేస్తూ మాట్లాడిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్నపై కేసు పెట్టాలని అప్పటి మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు రాజకీయ స్వార్థం కోసం తనపై ఒత్తిడి చేశారని టీడీపీ నేత మైలవరపు దుర్గారావు తెలిపారు.

వెలంపల్లి ఒత్తిడితోనే బుద్దా వెంకన్నపై కేసు పెట్టా: మైలవరపు దుర్గారావు

వన్‌టౌన్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో ఆనాటి మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను సవాల్‌ చేస్తూ మాట్లాడిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్నపై కేసు పెట్టాలని అప్పటి మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు రాజకీయ స్వార్థం కోసం తనపై ఒత్తిడి చేశారని టీడీపీ నేత మైలవరపు దుర్గారావు తెలిపారు. ఇటీవల తన భార్య 44వ డివిజన్‌ కార్పొరేటర్‌ మైలవరపు రత్నకుమారితో పాటు వైసీపీని వీడి టీడీపీలో చేరిన ఆయన ఆదివారం బుద్దా వెంకన్నతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అప్పట్లో బుద్దా వెంకన్నపై కేసు పెట్టాలని వెలంపల్లి ఒత్తిడి చేస్తే తాను నిరాకరించానన్నారు. మనం తప్పు మాట్లాడాం అందుకే వెం కన్న సవాల్‌ చేశారని వెలంపల్లితో అన్నానని తెలిపారు. బుద్దా వెంకన్న రోజురోజుకు రెచ్చిపోతున్నాడని, అణచివేయాలని మంత్రి తన తో చెప్పారని దుర్గారావు పేర్కొన్నారు. తనపైన, పోలీసులపైన ఒత్తిడి తెచ్చి మరీ వెంకన్నపై కేసు పెట్టించారన్నారు.

Updated Date - Nov 25 , 2024 | 12:37 AM