Share News

పాపం.. పసికందు

ABN , Publish Date - Feb 20 , 2024 | 12:47 AM

పాల పెదవుల ఆర్తి తీరలేదు.. కళ్లు కూడా ఇంకా తెరుచుకోనే లేదు.. పేగు తాడు తడి కూడా ఆరలేదు.. ఈ చిట్టిబాబు అనాథగా చెత్తకుండీలో కనిపించాడు. ఏ తల్లి కన్నబిడ్డో పుట్టుకతోనే తనకంటూ ఎవరూ లేక అల్లాడిపోయాడు. గుక్కపెట్టి ఏడ్చాడు. చెత్తకుండీ దుర్వాసనలో తల్లి చనుబాలు కోసం వెంపర్లాడాడు.

పాపం.. పసికందు

పుట్టిన గంటల్లోనే విడిచి వెళ్లిన తల్లి

ఏడుపు వినిపించి అక్కున చేర్చుకున్న స్థానికులు

పోలీసుల సహకారంతో చైల్డ్‌ వెల్ఫేర్‌ చెంతకు..

చిట్టినగర్‌, ఫిబ్రవరి 19 : పాల పెదవుల ఆర్తి తీరలేదు.. కళ్లు కూడా ఇంకా తెరుచుకోనే లేదు.. పేగు తాడు తడి కూడా ఆరలేదు.. ఈ చిట్టిబాబు అనాథగా చెత్తకుండీలో కనిపించాడు. ఏ తల్లి కన్నబిడ్డో పుట్టుకతోనే తనకంటూ ఎవరూ లేక అల్లాడిపోయాడు. గుక్కపెట్టి ఏడ్చాడు. చెత్తకుండీ దుర్వాసనలో తల్లి చనుబాలు కోసం వెంపర్లాడాడు. కొత్తపేట శ్రీనివాస్‌ మహల్‌ కొండప్రాంతంలో సోమవారం జరిగిన ఈ ఘటన అందరికీ కన్నీరు తెప్పించింది. పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీనివాస్‌ మహల్‌ వద్ద పడాలవారి వీధి కొండ ప్రాంతంలో చెత్త డబ్బాలో సోమవారం శిశువు ఏడుపు వినిపించింది. దీంతో చుట్టుపక్కల మహిళలు అక్కడికి వెళ్లి చూడగా చెత్త డబ్బాలో అప్పుడే పుట్టిన ఓ మగశిశువు కనిపించింది. వెంటనే స్థానికులు అంగన్వాడీ టీచర్‌తో పాటు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై దేవసుధ అక్కడి చేరుకున్నారు. స్థానిక మహిళలు, అంగన్వాడీ టీచర్‌ సహకారంతో మగశిశువును బయటకు తీసి వైద్య సేవలు అందించేందుకు సమీపంలోని రాజా సాహెబ్‌ ఆసుపత్రికి తరలించారు. అనంతరం శిశువుకు సంబంధించి ఎస్సై చుట్టుపక్కల ఆరా తీశారు. ఎటువంటి సమాచారం లభించలేదు. అంగన్వాడీ టీచర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శిశువును చైల్డ్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌కు అప్పగించారు.

Updated Date - Feb 20 , 2024 | 12:47 AM