రైతుల ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు అమరావతిలో 9 కేంద్రాలు
ABN , Publish Date - Oct 25 , 2024 | 01:15 AM
రాజధాని ప్రాంత అభివృద్ధికి భూములు ఇచ్చి ప్లాట్లు పొందిన రైతుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో 9 రిజిస్ర్టేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసిందని ఏపీసీఆర్డీయే అదనపు కమిషనర్ జి.సూర్యసాయి ప్రవీణ్‌చంద్ తెలిపారు.

వన్‌టౌన్, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): రాజధాని ప్రాంత అభివృద్ధికి భూములు ఇచ్చి ప్లాట్లు పొందిన రైతుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో 9 రిజిస్ర్టేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసిందని ఏపీసీఆర్డీయే అదనపు కమిషనర్ జి.సూర్యసాయి ప్రవీణ్‌చంద్ తెలిపారు. భూములు ఇచ్చిన రైతులకు సీఆర్డీయే కార్యాలయంలో ఈ-లాటరీ కార్యక్రమాన్ని రెండో రోజు గురువారం నిర్వహించారు. ప్రొవిజనల్ సర్టిఫికెట్లు పొందిన రైతులు వారం లోపు రిజిస్ర్టేషన్ కేంద్రాలకు వెళ్లి తమ ప్లాట్లను రిజిస్ర్టేషన్ చేయించుకోవచ్చునని ఆయన తెలిపారు. భూమిపై ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో రైతులకు తెలియజేసేందుకు ప్రత్యేకంగా గ్రామ సర్వేయర్లను నియమించినట్లు తెలిపారు. 9 గ్రామాలకు చెందిన 71 మంది రైతులకు 98 నివాస, 72 వాణిజ్య ప్లాట్లను అందజేశారు. కార్యక్ర మంలో ఏపీసీఆర్డీయే ల్యాండ్స్ డైరెక్టర్ డీఎల్‌ఎన్ రాజకుమారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వి.డేవిడ్ రాజు, జి.భీమారావు, కె.స్వర్ణమేరి, జి.సాయి శ్రీనివాసనాయక్, తహసీల్దార్ అరుణాదేవి పాల్గొన్నారు.