Share News

దుర్గమ్మను దర్శించుకున్న 52 వేల మంది

ABN , Publish Date - Jul 15 , 2024 | 01:01 AM

ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను 52 వేల మందికి పైగా భక్తులు ఆదివారం దర్శించుకున్నారు.

దుర్గమ్మను దర్శించుకున్న 52 వేల మంది
కిటకిటలాడుతున్న క్యూలైన్లు

వన్‌టౌన్‌, జూలై 14: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను 52 వేల మందికి పైగా భక్తులు ఆదివారం దర్శించుకున్నారు. 4350 మందికి పైగా భక్తులు ఆషాఢ సారెలు సమర్పించారు. వర్షం కురుస్తున్నప్పటికీ ఆదివారం, అష్టమి తిథి సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చారు. ధర్మపథం వేదికపై హైదరాబాద్‌కు చెందిన వారాహి డ్యాన్స్‌ అకాడమీ శంకరమంచి ఆదిలక్ష్మి శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ఆహుతులను అలరించింది.

నేటితో వారాహి నవరాత్రులు ముగింపు

ఈనెల 6వతేదీ నుంచి దుర్గగుడిలో నిర్వహిస్తున్న వారాహి నవరాత్రులు సోమవారంతో ముగియనున్నాయి. ఉదయం 10 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించనున్పారు.

దుర్గగుడికి రూ.51.16లక్షల ఆదాయం

దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో కనకదుర్గమ్మను దర్శించు కునేందుకు ఆదివారం భక్తులు విశేషంగా విచ్చేశారు. దేవస్థానానికి సాయంత్రం 7 గంటల వరకు వివిధ టికెట్ల ద్వారా సమకూరిన ఆదాయాన్ని ఈవో కేఎస్‌ రామారావు ఒక ప్రకటనలో వెల్లడిం చారు. రూ.500 దర్శనం టికెట్ల టికెట్ల ద్వారా రూ.15,31,500, రూ.300 టికెట్లద్వారా రూ.4,79,100, రూ.100 టికెట్ల ద్వారా రూ.6, 05,300 ఆదాయం సమకూరింది. కేశఖండన శాలలో 2611 మంది తల నీలాలు సమర్పించారు. విరాళాల ద్వారా రూ.9,32,753 ఆదా యం సమకూరినట్లు ఈవో తెలిపారు.

Updated Date - Jul 15 , 2024 | 01:01 AM