27 దళిత సంక్షేమ పథకాలను అమలు చేయాలి
ABN , Publish Date - Dec 12 , 2024 | 12:50 AM
గత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన దళితులకు సంబంధించిన సుమారు 27 సంక్షేమ పథకాలను అమలు చేయాలని మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
27 దళిత సంక్షేమ పథకాలను
అమలు చేయాలి
మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్
ధర్నాచౌక్, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన దళితులకు సంబంధించిన సుమారు 27 సంక్షేమ పథకాలను అమలు చేయాలని మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళిత హక్కుల పోరాట సమితి (డీహెచ్‌పీఎస్) రాష్ట్ర కార్యవర్గ సమావేశం దాసరి భవన్‌లో బుధవారం జరిగింది. ఈ సందర్భంగా విల్సన్ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు మత ఉద్రిక్తలను రెచ్చగొడుతూ సనాతనధర్మం అంటూ ఉపన్యాసాలు ఇస్తూ ఓట్ల రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి దేశ సమగ్రతను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా దళిత్ రైట్స్ మూమెంట్ ద్వితీయ మహాసభలు హైదరాబాద్‌లో జరగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో డీహెచ్‌పీఎస్ బలోపేతానికి తగిన చర్యలు తీసుకోవాలని నాయకత్వానికి సూచించారు. సమితి రాష్ట్ర అధ్యక్షుడు జీవీ ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ బుట్టి రాయప్ప తదితరులు పాల్గొన్నారు.