Share News

నందిగామలో 2,03,437 మంది ఓటర్లు

ABN , Publish Date - Apr 18 , 2024 | 01:16 AM

ఎస్సీ నియోజకవర్గమైన నందిగామలో మొత్తం 2,03,437 మంది ఓటర్లు ఉన్నట్లు నందిగామ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, ఆర్డీవో రవీంద్రరావు తెలిపారు.

నందిగామలో 2,03,437 మంది ఓటర్లు

నందిగామ, ఏప్రిల్‌ 17: ఎస్సీ నియోజకవర్గమైన నందిగామలో మొత్తం 2,03,437 మంది ఓటర్లు ఉన్నట్లు నందిగామ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, ఆర్డీవో రవీంద్రరావు తెలిపారు. వీరిలో పురుషులు 98,486 కాగా, మహిళా ఓటర్లు 1,04,945 మంది ఉన్నట్లు తెలిపారు. ఇతరులు ఆరుగురు, సర్వీస్‌ ఓటర్లు 41 మంది ఉన్నారని పేర్కొన్నారు. 108 ప్రాంతాల్లో మొత్తం 222 బూత్‌లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అత్యధికంగా కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామంలోని 176 బూత్‌లో 1489 మంది ఓటర్లు ఉం డగా, అత్యల్పంగా వీరులపాడు మండలం తిమ్మాపురంలోని బూత్‌ నెంబర్‌ 155లో కేవ లం 144 మంది ఓటర్లు మాత్రమే ఉన్నట్లు చెప్పారు. సెక్టార్‌, రూట్‌ అధికారులతో పాటు ఎంసీసీ వంటి పలు విభాగాలతో సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకూ 8.97 లక్షల రూపాయల నగదు, 174 మద్యం బాటిళ్లు సీజ్‌ చేసినట్లు తెలిపారు.

Updated Date - Apr 18 , 2024 | 07:26 AM