Share News

ఈ ఏడాది 20 వేల ఎకరాల్లో పత్తి సాగు

ABN , Publish Date - May 31 , 2024 | 01:11 AM

సబ్‌ డివిజన్‌లో ఈ ఏడాది 20వేల ఎకరాల్లో పత్తి సాగయ్యే అవకాశం ఉందని జగ్గయ్య పేట వ్యవసాయ శాఖ సహాయ సంచా లకురాలు సీహెచ్‌ భవాని తెలిపారు.

ఈ ఏడాది 20 వేల ఎకరాల్లో పత్తి సాగు
జగ్గయ్యపేటలో విత్తన దుకాణంలో తనిఖీలు చేస్తున్న ఏడీఏ భవాని

అందుబాటులో 55 వేల ప్యాకెట్ల విత్తనాలు: జగ్గయ్యపేట ఏడీఏ సీహెచ్‌ భవాని

జగ్గయ్యపేట, మే 30: సబ్‌ డివిజన్‌లో ఈ ఏడాది 20వేల ఎకరాల్లో పత్తి సాగయ్యే అవకాశం ఉందని జగ్గయ్య పేట వ్యవసాయ శాఖ సహాయ సంచా లకురాలు సీహెచ్‌ భవాని తెలిపారు. పత్తి విత్తనాలకు ఎలాంటి కొరత లేదని, విత్తన విక్రయ దుకాణాల్లో 55 వేల ప్యాకెట్ల విత్తనాలు అందుబాటులో ఉన్నా యని ఆమె తెలిపారు. గురువారం పట్టణంలోని పలు విత్తనవిక్రయ దుకా ణాలను ఆమె తనిఖీ చేశారు. స్టాకు రిజి స్టర్లను పరిశీలించారు. రైతులు కొనుగోలు చేసిన విత్తనాలకు బిల్లులు తీసుకోవాలని, అధీకృత డీలర్ల వద్దనే కొనుగోలు చేయాలని ఆమె సూచించారు. ప్రస్తుతం అధిక ఉష్ణోగ్ర తల వలన విత్తనం మొలకెత్తకుండా దెబ్బ తింటున్నందున తొందరపడి రైతులు విత్త నాలు నాటొద్దని, తగినంత తేమశాతం ఉన్న ప్పుడే నాటాలని ఆమె సూచించారు. ఎమ్మా ర్పీకి మించి ఎక్కడైనా పత్తి విత్తనాలు అమ్మి తే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కొన్ని కంపెనీల విత్తనాలనే అడగటం వల్ల కృత్రిమ కొరత సృష్టించి సొమ్ము చేసుకునే ప్రయత్నాలను ప్రోత్సహించవద్దని, సాగు పద్ధతులపైనే ఆధారపడి దిగుబడి ఉంటుం దని రైతులు గమనించాలని ఆమె తెలిపారు.

Updated Date - May 31 , 2024 | 01:11 AM