జగన్ పాలనలో రూ.12.93 లక్షల కోట్ల ఆర్థిక విధ్వంసం: దేవినేని ఉమా
ABN , Publish Date - Jul 28 , 2024 | 12:58 AM
ఐదేళ్లలో మాజీ ముఖ్యమంత్రి జగన్ రూ.12,93,216 కోట్ల ఆర్థిక విధ్వంసం చేశారని మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఆరోపించారు.

గొల్లపూడి, జూలై 27: ఐదేళ్లలో మాజీ ముఖ్యమంత్రి జగన్ రూ.12,93,216 కోట్ల ఆర్థిక విధ్వంసం చేశారని మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఆరోపించారు. గొల్లపూడిలో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రజలపై 9,74,556 కోట్ల భారం మోపాడని దుయ్యబట్టారు. అడ్డగోలుగా అప్పులు చేసి ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టాడన్నారు. ప్రజలు 11 సీట్లకు జగన్‌ను పరిమితం చేస్తే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండని సిగ్గులేకుండా న్యాయస్థానాలకు ఎక్కాడన్నారు. ప్రజలను నమ్మిం చేందుకు తాడేపల్లి ప్యాలెస్‌లో ఉండి మాట్లాడుతున్నాడన్నారు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడే దమ్ము, ధైర్యం జగన్‌కు లేదన్నారు. ప్రజలకు సూపర్‌సిక్స్ పథకాలు చేరేలా టీడీపీ కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు.