108 కొబ్బరి కాయలు కొట్టి మొక్కు తీర్చుకున్న తెలుగుమహిళలు
ABN , Publish Date - Jun 07 , 2024 | 01:27 AM
కానూరు కేసీపీ కాలనీ తెలుగు మహిళలు సాయిబాబా ఆలయం వద్ద 108 కొబ్బరి కాయలు కొట్టి మొక్కు తీర్చుకొన్నారు.

పెనమలూరు, జూన్ 6: టీడీపీ కూటమి భారీ విజయం సాధించి, ఎమ్మెల్యేగా బోడె ప్రసాద్ గెలుపొందిన సందర్భంగా తెలుగుమహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి యార్లగడ్డ సుచిత్ర ఆధ్వర్యంలో కానూరు కేసీపీ కాలనీ తెలుగు మహిళలు సాయిబాబా ఆలయం వద్ద 108 కొబ్బరి కాయలు కొట్టి మొక్కు తీర్చుకొన్నారు. యార్లగడ్డ రూప్‌కుమార్, కళ్యాణి, కస్తూరి, జ్యోతి, లక్ష్మి, లక్ష్మీసుధ, నీరజ, ప్రవీణ, కిషోర్ పాల్గొన్నారు.
యనమలకుదురులో..
చంద్రబాబు ముఖ్యమంత్రిగా, బోడె ప్రసాద్ ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంగా యనమలకుదురు గోపాలస్వామి ఆలయంలో కోదండరామ భజన సమాజం సభ్యులు 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. యనమలకుదురు ఎన్టీ ఆర్ గార్డెన్స్ వద్ద నిర్వహించిన గెలుపు సంబరాల్లో టీడీపీ కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడు వెలగపూడి శంకరబాబు, పార్టీ తాడిగడప మునిసిపాలిటీ కార్యదర్శి మొక్కపాటి శ్రీనివాస్ ఆధ్వర్యాన స్థానికులకు స్వీట్లు పంచారు.