Share News

జడ్పీటీసీ, ఎంపీపీలు రాజీనామా చేయాలి

ABN , Publish Date - Jul 12 , 2024 | 11:34 PM

మండలంలో జడ్పీ టీసీ బైసాని జ్యోతి, ఎంపీపీ దస్తిగిరిలు వారి వారి సభ్యత్వానికి రాజీనామాలు చే యాలని టీడీపీ నేతలు డిమాండ్‌ చేశారు.

జడ్పీటీసీ, ఎంపీపీలు రాజీనామా చేయాలి
ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న టీడీపీ నాయకులు

ఆందోళనలో టీడీపీ నాయకుల డిమాండ్‌

కురబలకోట, జూలై 12:మండలంలో జడ్పీ టీసీ బైసాని జ్యోతి, ఎంపీపీ దస్తిగిరిలు వారి వారి సభ్యత్వానికి రాజీనామాలు చే యాలని టీడీపీ నేతలు డిమాండ్‌ చేశారు. ఆమేరకు టీడీపీ నేత సురేంద్రయాదవ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ఎంపీడీవో కార్యాల యం ఎదుట జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు రాజీనామా చేయాలని డిమాండు చేస్తూ టీడీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సురేంద్రయాదవ్‌ మాట్లాడుతూ మంత్రి నారా లోకేశ యువగళం పాదయా త్రలో భాగంగా తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువులో జరిగిన బహిరంగ సభలో వైసీపీ నేతలు చేపట్టిని అవినీతిని ప్రశ్నించారని తెలిపారు. అయితే విమర్శలను తట్టుకోలేక ఆయనపై వ్యక్తిగత దూషణలకు పాల్పడి అధికారంలో ఉన్నప్పుడు తన ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపించారు. వెంటనే వారు చేసిన వ్యాఖ్యలను వెనుక్కు తీసుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండు చేశారు. అలాగే లోకేశపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకులు అంగళ్ల బస్టాండులో బహిరంగ క్షమాపణ చెప్పాలని లేకుంటే సహించేది లేదని టీడీపీ మాజీ కన్వీనర్‌ రాఘవరెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు భూమిరెడ్డి, ఎల్లారెడ్డి, అయూబ్‌బాషాలు పాల్గొన్నారు.

Updated Date - Jul 12 , 2024 | 11:34 PM