Share News

విద్యార్థిని మృతిపై వైవీయూ తీవ్ర దిగ్ర్భాంతి

ABN , Publish Date - Apr 16 , 2024 | 11:55 PM

వైవీయూ బయోటెక్నాలజీ విద్యార్ధిని సుల్తానా మృతి పట్ల తోటి విద్యార్థులు అధ్యాపకులు అధికారులు తీవ్ర దిగ్ర్భాంతిని, ఆవేదనను వ్యక ్తం చేశారు.

విద్యార్థిని మృతిపై వైవీయూ తీవ్ర దిగ్ర్భాంతి
విద్యార్థులకు ధైర్యం చెబుతున్న వైవీయూ ప్రిన్సిపాల్‌ రఘునాథరెడ్డి,

కడప (ఎడ్యుకేషన), ఏప్రిల్‌ 16 : వైవీయూ బయోటెక్నాలజీ విద్యార్ధిని సుల్తానా మృతి పట్ల తోటి విద్యార్థులు అధ్యాపకులు అధికారులు తీవ్ర దిగ్ర్భాంతిని, ఆవేదనను వ్యక ్తం చేశారు. మంగళవారం మధ్యాహ్నం వరకు తరగతి గదిలో తోటి విద్యార్థులతో కలిసి పాఠాలు విన్న సుల్తానా అంతలోనే హాస్టలు వసతిగృహంలో బలన్మరణాననికి పాల్పడిందని తెలియడం కలచివేసింది. విషయం తెలియగానే వైవీయూ ప్రిన్సిపాల్‌ రఘునాఽథరెడ్డి, రిజిసా్ట్రరు ప్రొఫెసరు వైపీ వెంకటసుబ్బయ్య, సీఈ ప్రొఫెసరు ఈశ్వర్‌రెడ్డి, హెల్త్‌ సెంటరు వైద్యులు నరే్‌షకుమార్‌రెడ్డి విద్యార్థినిని రిమ్స్‌కు తరలించారు. ఆమె తల్లిదండ్రులకు సమాచచారం అందించారు. హాస్టలులో తరగతి గదిలో అధ్యాపకులతో మాట్లాడారు. గత వారంలో పండుగ సెలవులు ఉండడంతో సుల్తానా తన సొంత ఊరు అయిన కదిరికి వెళ్లి సోమవారం యథావిధిగా తరగతులకు హాజరైనట్లు తోటి విద్యార్థులు తెలిపారు. తరగతిలో కూడా యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపారు. కాన్ఫరెన్స కోసం హైదరాబాదు వెళ్లిన వైస్‌ఛాన్సలర్‌ ప్రొఫెసరు చింతా సుధాకర్‌ విద్యార్థిని మృతిపై ఆరా తీశారు.

Updated Date - Apr 16 , 2024 | 11:55 PM