Share News

టీడీపీ ప్రచార రథంపై వైసీపీ కార్యకర్తల దాడి

ABN , Publish Date - Mar 04 , 2024 | 11:20 PM

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రవీణ్‌రెడ్డి ప్రచార రథంపై వైసీపీ కార్యకర్తలు సోమవారం సాయంత్రం దాడి చేశారు.

టీడీపీ ప్రచార రథంపై వైసీపీ కార్యకర్తల దాడి

ప్రొద్దుటూరు, మార్చి 4: టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రవీణ్‌రెడ్డి ప్రచార రథంపై వైసీపీ కార్యకర్తలు సోమవారం సాయంత్రం దాడి చేశారు. స్థానిక ఈశ్వర్‌రెడ్డి నగర్‌ ప్రాంతంలో టీడీపీ ఆటో ప్రచారాన్ని నిర్వహిస్తుండగా వైసీపీ కార్యకర్తలు ఆటో, డ్రైవర్‌ వెంకటరమణపై దాడికి యత్నించగా అతడు ఆటోను వదిలి పరారయ్యాడు. రాళ్లతో ఆటోను కొట్టడంతో ఫ్లెక్సీలు చిరిగిపోయాయి. ఈ మేరకు ప్రవీణ్‌రెడ్డి వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Mar 04 , 2024 | 11:21 PM