Share News

గ్రూప్‌-1 పోస్టులలో నిరుద్యోగులకు వైసీపీ కుచ్చుటోపి

ABN , Publish Date - Mar 16 , 2024 | 12:03 AM

గ్రూప్‌-1 పోస్టులను వైసీపీ ప్రభుత్వం సంతలో పెట్టి విక్రయించేసి నిరుద్యోగులకు కు చ్చుటోపి పెట్టిందని తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు నాదెళ్ల అరు ణ్‌తేజ్‌ ధ్వజమెత్తారు.

గ్రూప్‌-1 పోస్టులలో నిరుద్యోగులకు వైసీపీ కుచ్చుటోపి
మాట్లాడుతున్న తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు అరుణ్‌తేజ

మదనపల్లె టౌన, మార్చి 15: గ్రూప్‌-1 పోస్టులను వైసీపీ ప్రభుత్వం సంతలో పెట్టి విక్రయించేసి నిరుద్యోగులకు కు చ్చుటోపి పెట్టిందని తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు నాదెళ్ల అరు ణ్‌తేజ్‌ ధ్వజమెత్తారు. శుక్రవారం స్థానిక టీడీపీ పార్లమెంట్‌ కార్యాలయంలో తెలు గు యువత నాయకులతో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రూప్‌-1 పోస్టులైన డిప్యూటీ కలెక్టర్‌ పోస్టును రూ.2.5కోట్లు, డీఎస్పీ పోస్టును రూ.1.5కోటికి వైసీపీ ప్రభు త్వం వసూలు చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో 30 డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులు, 25 డీఎస్పీ పోస్టులను అక్రమంగా భర్తీ చేయడంపై ఏపీపీఎస్సీ మోసాలపై హైకోర్టు మొటి క్కాయలు వేసిందన్నారు. రాష్ట్రంలో 162 మంది గ్రూప్‌-1 పోస్టుల నియామకాలు చెల్లవ ని, నెల లోపు మళ్లీ గ్రూప్‌-1 పరీక్షలు నిర్వహించి నియామకపు ప్రక్రియ పూర్తి చేయా లని హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. దీనికి బాధ్యత వహించి సీఎం జగన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత ప్రధాన కార్యదర్శి బావాజాన, పట్టణ అధ్యక్షుడు ప్రణయ్‌రాయల్‌, శివకృష్ణ, సిద్దు, కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2024 | 12:03 AM