ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటా..
ABN , Publish Date - Jul 05 , 2024 | 11:10 PM
పీలేరు నియోజక వర్గంలో ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉండి ఆదుకుంటానని ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

వాల్మీకిపురం, జూలై 5: పీలేరు నియోజక వర్గంలో ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉండి ఆదుకుంటానని ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వాల్మీకిపురం వ్యవసాయ మా ర్కెట్ కార్యాలయ ఆవరణలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలకు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో దైర్జన్యాలు, అవినీతి అక్రమాలు తప్పా ప్రజలకు ఒరిగింది శూన్యమని విమ ర్శించారు. ఎన్నికల్లో ఆదరించి ప్రజలు మంచి మెజార్టితో గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఏ కష్టమొచ్చినా తప్పక ఆదు కుంటానని హామీ ఇచ్చారు. వాల్మీకిపురం మండల పర్యటనలో శుక్రవారం టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డికి గజమాలలతో స్వాగతం పలుకుతూ సుమారు 2వేల బైక్‌లతో భారీ ర్యాలీ నిర్వహించా రు. అనంతరం ప్రభుత్వ అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈసందర్భం గా ఆయన మాట్లాడుతూ అధికారులు జాగ్రత్తతో విధులు నిర్వహించాలన్నారు. కార్యక్రమాలలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన కంభం నిరంజనరెడ్డి, పీలేరు జనసేన ఇనచార్జి బెజవాడ దినేష్, మండల పార్టీ అధ్యక్షుడు మల్లికార్జునరెడ్డి, పీలేరు తెలుగు యువత అధ్యక్ష, ఉపాధ్యక్షులు మహిధర్‌రెడ్డి, లంకిపల్లె మధు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నరేంద్రరెడ్డి, నాయకులు గాంధీపేట రమణ, కృష్ణారెడ్డి, పులి సత్యారెడ్డి, రాజేంద్రాచారి, పీలేరు పార్టీ మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్‌బాషా, శేషాద్రిరెడ్డి, ద్వారకనాథరెడ్డి, పీవీ నారాయణ, వల్లిగట్ల రమణ, మద్దెల గిరిబాబు, రవికుమార్‌రెడ్డి, బొక్కసం బ్రదర్స్, తెలు గు యువత చాను, సాదిక్, డిష్ బ్రదర్స్, యూసుఫ్, జనసేన ప్రభాకర్, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు.