Share News

మహాశివరాత్రి పూజలు జరిగేనా..?

ABN , Publish Date - Mar 06 , 2024 | 12:08 AM

మండలంలోని తవళం అటవీప్రాతం బాహుదా నదీ పరివాహక ప్రాంతంలో వెలసిన నేలమల్లేశ్వస్వామి ఆలయంలో ఈ ఏడాది మహాశివరాత్రి పూజలు జరిగేటట్లు కనిపించడంలేదంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మహాశివరాత్రి పూజలు జరిగేనా..?
శివరాత్రి ఏర్పాట్లపై సమీక్షిస్తున్న ఈవో మంజుల, అధికారులు

ఫ నేలమల్లేశ్వరస్వామి ఆలయ నిర్మాణంతో అయోమయంలో ప్రజలు ఫఉత్సవాలకు ఏర్పాట్లు చేశామన్న ఈవో మంజుల

నిమ్మనపల్లి, మార్చి 5: మండలంలోని తవళం అటవీప్రాతం బాహుదా నదీ పరివాహక ప్రాంతంలో వెలసిన నేలమల్లేశ్వస్వామి ఆలయంలో ఈ ఏడాది మహాశివరాత్రి పూజలు జరిగేటట్లు కనిపించడంలేదంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1986లో భక్తాదులు ఇచ్చిన విరాళాలతో వెంకటరమణరెడ్డి, ఇట్టా శేషయ్యశెట్టిలు ఆలయాన్ని నిర్మిం చారు. అయితే అప్పుడు నిర్మించిన గుడి వర్షాలకు దెబ్బతినడంతో దేవదాయశాఖ ఆలయ నిర్మాణానికి దాదాపు రూ.3,18లక్షలతో గత మూడు నెలలుగా నిర్మాణ పనులు చేపడుతున్నారు. దీంతో ఆలయ పనులు అసంతృప్తిగా ఉండడంతో భక్తులు ఈయేడు శివరాత్రి ఉత్సవాలు ఉండవని నిర్ధారణకు వచ్చారు.

మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు చేశాం

ఈ ఏడాది ఆలయం పక్కన ఉన్న మండపంలో శివరాత్రిని ఉత్సవాలు నిరంహించనున్నట్లు ఈవో మంజుల తెలిపారు. అయితే స్వయంబు బాలాశంకరుడి ఆలయంలో పూజలు జరగవని తెలిపారు. కాగా శివరాత్రికి ఆలయం వద్దకు వచ్చే భక్తులకు అన్నదానంతో పాటు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నూతనంగా ఆలయ నిర్మాణం చేపడుతున్నామని గర్బగుడికి రూ.2కోట్లు మంజూరు అయిందని ఆలయ ఈవో తెలిపారు. కాగా మంగళవారం ఆలయ నిర్వాహకులు, మండల స్థాయి అధికారులతో కమిటీ సమావేశం నిర్వ హించి మహాశివరాత్రి ఉత్సవాలపై చర్చించారు.

Updated Date - Mar 06 , 2024 | 12:08 AM