Share News

తప్పులను సరిదిద్దేదెవరు...!

ABN , Publish Date - Feb 06 , 2024 | 11:26 PM

ఎన్నికల కమిషన్‌ ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో అక్రమాలు తవ్వేకొద్దీ బయటపడుతూనే ఉన్నాయి. ముసాయిదా ఓటర్ల జాబితాలోని అక్రమాలపై అనేక ఫిర్యాదులు చేసినా వాటిని తొలగించకుండా తుది ఓటర్ల జాబితా ప్రకటించారు.

తప్పులను సరిదిద్దేదెవరు...!

చనిపోయిన వారికీ ఓటు

ఒకే పోలింగ్‌ బూత్‌లో చనిపోయిన 14 మందికి ఓట్లు

ఒంటిమిట్ట, ఫిబ్రవరి 6 : ఎన్నికల కమిషన్‌ ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో అక్రమాలు తవ్వేకొద్దీ బయటపడుతూనే ఉన్నాయి. ముసాయిదా ఓటర్ల జాబితాలోని అక్రమాలపై అనేక ఫిర్యాదులు చేసినా వాటిని తొలగించకుండా తుది ఓటర్ల జాబితా ప్రకటించారు. అందులో చనిపోయిన వారి ఓట్లు కూడా అలాగే ఉన్నాయి. రాజంపేట నియోజకవర్గ ఒంటిమిట్ట పోలింగ్‌ కేంద్రంలో 45లో మొత్తం ఓటర్లు 891 మంది కాగా అందులో పురుషులు 436, స్త్రీలు 455 ఓటర్ల లిస్టులో ఉండగా వారిలో ఏకంగా 14 మంది చనిపోయిన వారి ఓటర్లు లిస్టులో ఉన్నాయి. సీరియల్‌ నెంబరు 24 యాడ్ల రామాంజనేయులు ఓటరు కార్డు నెంబరు ఎల్‌ఎంఎల్‌2253059, సీరియల్‌ నెంబరు 22 పాటూరు సుబ్బరామిరెడ్డి జేఓకె0715789, సీరియల్‌ నెంబరు 382 భీయ్య బ్రహ్మదండు జేవోకె0903287, సీరియల్‌ నెంబరు 441 వెంకట సుబ్బయ్య జేవోకె104430, సీరియల్‌ నెంబరు 444 వెంకటసుబ్బయ్య, పెద్దపల్లి జేవోకె0104839, సీరియల్‌ నెంబరు 562 సాయి ప్రసాద్‌ ఎల్‌ఎంఎల్‌0740456, సీరియల్‌ నెంబరు 581 మల్లేష్‌ పెద్దపల్లి జేవోకె1809631, సీరియల్‌ నెంబరు 598 విజయమ్మ నీలపూజ జేవోకె1809730, సీరియల్‌ నెంబరు 599 శేషమ్మ సిరారపు జేవోకె1809763, సీరియల్‌ నెంబరు 606 చిన్న నరసమ్మమల్లెల జేవోకె1809789, సీరియల్‌ నెంబరు 664 రామయ్య ఆయపాటి ఎల్‌ఎంఎల్‌2252609, సీరియల్‌ నెంబరు 690 వెంకటసుబ్బయ్య బుర్ర ఎల్‌ఎంఎల్‌ 2252609, సీరియల్‌ నెంబరు 705 మోదుగుల శేషమ్మ జేవోకె 1810134, సీరియల్‌ నెంబరు 732 నాగలక్షుమ్మ ఆవుల బాలయ్యగారి జేవోకె1809011 ఇలా 14 మంది ఓటర్లు ఒకే పోలింగ్‌ బూత్‌లో చనిపోయిన వారు ఉన్నారు. ఇలా మండలంలోని అన్ని బూత్‌ల్లో ఇంకా ఎన్ని ఉంటాయోనని ప్రతిపక్ష పార్టీల నాయకులు విమర్శిస్తున్నారు.

Updated Date - Feb 06 , 2024 | 11:26 PM