Share News

గెలిపించినా.. ఓడించినా.. ప్రజలే అంతిమ నిర్ణేతలు

ABN , Publish Date - Feb 20 , 2024 | 12:04 AM

ఓట్లేసి గెలి పించి నా.. ఓడించినా.. అంతిమ నిర్ణేతలు ప్రొద్దుటూ రు ప్రజలని మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరద రాజులరెడ్డి స్పష్టం చేశారు.

గెలిపించినా.. ఓడించినా.. ప్రజలే అంతిమ నిర్ణేతలు
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి

ప్రొద్దుటూరు , ఫిబ్రవరి 19:ఓట్లేసి గెలి పించి నా.. ఓడించినా.. అంతిమ నిర్ణేతలు ప్రొద్దుటూ రు ప్రజలని మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరద రాజులరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం స్ధానిక టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ చెన్నకేశవ స్వామి ఆలయ భూము లను స్వాహా చేయడానికే ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి అందులో రోడ్లు వేశాడన్నారు. ఇప్పటికే మైలవరం ఉత్తర కాలువను ఆక్రమించి కట్టడాలు కట్టాడని, గోపవరంలో ప్రభుత్వ భూమి ఆక్రమించి చదును చేశాడన్నారు. ఆయన భూ దందాలను ప్రశ్నిస్తే తాను విజయవాడలో బ్రాహ్మణుడిని కాల్చి చంపి, అతని ఆస్తి కాజేశామని ఆరోపించాడన్నారు. తన రాజ కీయ జీవితంలో సెంటు భూమి ఆక్రమించి నట్లు నిరూపించమన్నారు. డీఏడబ్యూ కాలేజీ భూముల్లో ఎంత డబ్బులు గుంజాడో ఎవరిచేతుల మీద తీసుకున్నాడో త్వరలో వెల్లడిస్తానన్నారు. ప్రొద్దుటూరు మున్సి పాలిటీలో టౌన్‌ప్లానింగ్‌ సెక్షన్‌ అధికారులను అడ్డుగా పెట్టుకుని ఎక్కడెక్కడ ఎంత వసూ లు చేశావో త్వరలో వెల్లడిస్తానన్నారు. నీ అవినీతి సంపాదనంతా ప్రజలనుంచి దోచినదే కోట్లు కుమ్మరించినా నీవు ప్రజలు ఓట్లు వేసే పరిస్ధితి లేదన్నారు. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయని నీ అవినీతి చిట్టా ప్రజల ముందు వుంచుతానన్నారు. సమావేశంలో మాజీ కౌన్సిల్లర్‌ వద్దిబాలుడు,ఎర్రన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2024 | 12:04 AM