Share News

టీడీపీ అధికారంలోకి రాగానే బీసీలకు విముక్తి

ABN , Publish Date - Apr 12 , 2024 | 11:21 PM

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితోనే బీసీల అభ్యున్నతి సాధ్యమవు తుందని రాయచోటి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు.

టీడీపీ అధికారంలోకి రాగానే బీసీలకు విముక్తి
మాట్లాడుతున్న మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి

రాయచోటి టౌన, ఏప్రిల్‌ 12: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితోనే బీసీల అభ్యున్నతి సాధ్యమవు తుందని రాయచోటి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని పాతరాయచోటి 32, 33వ వార్డుల్లో జయహో బీసీ ఆత్మీయ సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ ల సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని హా మీ ఇచ్చారు. బీసీల రిజర్వేషన శాతాన్ని తగ్గించి వారి రాజకీయ ఎదుగుదలకు వైసీపీ అడ్డం పడిందని గుర్తు చేశారు. నాలుగు పర్యాయాలు గెలిచిన శ్రీకాంతరెడ్డి పాతరాయచోటిలో ప్రజలకు ఏం చేశారో చెప్పాలన్నారు. ఈ సమావేశానికి ముందు పాతరాయచోటిలో ఇంటింటికి తిరిగి ప్రచారంచేశారు. ఈ సమావేశంలో పాతరాయచోటికి చెందిన బీసీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండిపల్లి, సుగవాసి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పట్టణం లోని ఎస్‌ఎనకాలనీలోని టీడీపీ కార్యాలయంలో రిటైర్డ్‌ ఆర్మీ ఆఫీసర్స్‌ కలిసి శాలువా, పూలమాలలతో సత్కరించి వారి సంపూర్ణ మద్దతును ప్రక టించారు. అనంతరం ఆర్మీ కుటుంబాలకు చెందిన పలువురు మహిళలను, మాజీ ఆర్మీ ఆఫీసర్స్‌ను రాంప్రసాద్‌రెడ్డి శాలువాలతో సత్క రించారు. రిటైర్డ్‌ ఆర్మీ ఆఫీసర్స్‌ గురిగింజ బాలాజీ, గోపాల్‌రెడ్డి, రాజారెడ్డి, నరసిం హారెడ్డి, వేమారెడ్డి, ప్రతాప్‌రెడ్డి, పురుషోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గాలివీడు: మండలంలోని గోపనపల్లెలో మాజీ డీలర్‌ వెంకట్రమణారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నుంచి 50 కుటుంబాలు టీడీపీలో చేరాయి. స్థానిక టీడీపీ నాయకులు కోటిరెడ్డి, చలపతినాయుడు, ఇరుగుల్‌రెడ్డి, ఖాజాపీర్‌, వెంకటమల్లప్పనాయుడు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2024 | 11:21 PM