Share News

ఒకే తాటిపైకి సంక్షేమం - అభివృద్ధి

ABN , Publish Date - Jan 12 , 2024 | 11:20 PM

టీడీపీ అధికారంలోకి రాగానే చంద్రబాబు ఆధ్వర్యంలో సంక్షేమం, అభివృద్ధి ఒకే తాటిపైకి తెచ్చి రాష్ట్రాన్ని అభి వృద్ధి బాటలో నడిపిస్తారని జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జి సి.భూపేశ్‌రెడ్డి అన్నారు.

ఒకే తాటిపైకి సంక్షేమం - అభివృద్ధి
భూపేశ్‌ ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన వడ్డెర యువజన సంఘం నేతలు

కొండాపురంలో 60 కుటుంబాలు టీడీపీలో చేరిక

ఇంటింటికీ టీడీపీ మ్యానిఫెస్టో చేరవేత

బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీలో భూపేశ్‌రెడ్డి, బొజ్జా రోశన్న, ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి

ఎర్రగుంట్ల, జనవరి 12: టీడీపీ అధికారంలోకి రాగానే చంద్రబాబు ఆధ్వర్యంలో సంక్షేమం, అభివృద్ధి ఒకే తాటిపైకి తెచ్చి రాష్ట్రాన్ని అభి వృద్ధి బాటలో నడిపిస్తారని జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జి సి.భూపేశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం వలసపల్లెలో బా బు ష్యూరిటీ-భవిషత్తు గ్యారెంటీలో భాగంగా ఇంటింటికీ వెళ్లి టీడీ పీ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ తన ప్రచారాన్ని సాగించా రు. నియోజవర్గంలో తనకు ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభి స్తోందన్నారు. టీడీపీ కార్యకర్తలు మరింత చురగ్గా పాల్గొని పార్టీని అధికారంలోకి తెప్పించేందుకు పెద్దఎత్తున కృషిచేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో వైసీపీ మండల ఇన్‌చార్జి సి.జయరామిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జంబాపురం రమణారెడ్డి, మండల టీడీపీ బాధ్యులు మేకల మోహన్‌రెడ్డి, వలసపల్లె టీడీపీ నేతలు సుదర్శన్‌రెడ్డి, నాగ రాజు, చిన్నవెంకటసుబ్బయ్య, రామాంజనేయులు, పెద్దవెంకటసుబ్బ య్య, కేశవ్‌,నాగేంద్ర, మురళి, రవి, ఉగయ్య, వెంకటసుబ్బయ్య, నరే శ్‌, ప్రసాద్‌, పవన్‌కల్యాన్‌, రామజి, అంకల్‌, సుబ్బరాయుడు, సంజీ వ్‌, రాఘవేంద్రెడ్డి, పట్టణ, దేవగుడి అభిమానులు పాల్గొన్నారు.

60 కుటుంబాలు టీడీపీలో చేరిక

కొండాపురం, జనవరి 12: పట్టణంలో వడ్డెర యువజన సంఘీయు లు 60 కుటుంబాలు జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జ్‌ భూపేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. యువతకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం బాబుష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీలో టీడీపీ మెనిఫెస్టో గురించి ఇంటింటికీ వెళ్లి వివరించారు. కార్యక్రమంలో మాజీ ఎంఎల్‌సీ శివనాథరెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జంభాపురం రమణారెడ్డి, మండల టీడీపీ అధ్యక్షుడు గండ్లూరు నాగేశ్వరరెడ్డి, టీడీపీ క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌ గోరుశెట్టి బాబు, నియోజకవర్గ టీడీపీ మహిళా అధ్యక్షురాలు ఇందిరమ్మ, మండల మహిళా టీడీపీ అధ్యక్షురాలు పద్మజ, మాజీ సర్పంచ్‌ రామలింగేశ్వరరెడ్డి, టీడీపీ నేతలు గండ్లూరు శంకర్‌రెడ్డి, చామల విష్ణువర్ధన్‌ రెడ్డి, గిరీష్‌, శివ, సాయి, ఉదయ్‌కుమార్‌, వడ్డెర యువజన సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు.

గడ్డివాములను కాల్చివేయడం దుర్మార్గపు చర్య

తాళ్లప్రొద్దుటూరులో కోమనూతల నరసింహ గడ్డివాములను కాల్చివేయడం దుర్మార్గపు చర్య అని భూపేశ్‌రెడ్డి తెలిపారు. సంఘటన స్థలాన్ని శుక్రవారం పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కొండాపురం ఎస్‌ఐ యోగీంద్రకు ఫిర్యాదు చేశారు.

పోరుమామిళ్లలో....

పోరుమామిళ్ల, జనవరి 12: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు రూపొందించిన టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరిస్తూ టీడీపీ నేతలు కరపత్రాలు అందించారు. శుక్రవారం బలిజకోటవీధిలో, 9, 10 వార్డుల్లో బద్వేలు టీడీపీ ఇన్‌చార్జ్‌ బొజ్జ రోశన్న కరపత్రాలు పంచారు. పోరుమామిళ్ల సర్పంచ్‌ యనమల సుధాకర్‌, మండల తెలుగుయువత అధ్యక్షుడు సీతాబాలాజీ, సంచ ర్ల మాజీ సర్పంచ్‌ సోమిరెడ్డి, టీడీపీ నేతలు రామసుబ్బారావు, సీతా వెంకటసుబ్బయ్య, ఇమాంహుసేన్‌, సెట్టం ప్రతాప్‌, కరీముల్లా, ఎస్‌ ఎంబాషా, అన్వర్‌, వెంకటేశ్వర్లు, ధర్వేష్‌, నాగరాజ్‌ పాల్గొన్నారు.

శుక్రవారం సాయంత్రం రితీష్‌రెడ్డి ఆధ్వర్యంలో సిద్దనకిచ్చాయప ల్లెలో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కరపత్రాలు పంపిణీ చేశారు. టీడీపీ ఇన్‌చార్జ్‌ బొజ్జ రోశన్న, మండల పార్టీ అధ్యక్షుడు భైరవ ప్రసాద్‌, రామసుబ్బారావు, పాణ్యం వెంకటసత్యం, ప్రొఫెసర్‌ బాషా, తదితరులు పాల్గొన్నారు.

ప్రొద్దుటూరులో....

ప్రొద్దుటూరు, జనవరి 12: వైసీపీ ఎమ్మెల్యేల దౌర్జన్య కాండతోనే జగన్‌ ప్రభుత్వం పడిపోతుందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ప్రవీణ్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం విజయకుమార్‌ సర్కిల్లో బా బూ ష్యూరిటీ భవిష్యత్తుకు గారెంటీ చేపట్టారు. కార్యక్రమంలో టీడీ పీ నేతలు విశ్వనాధరెడ్డి తాటి శీను పొట్టిపాటి గంగాధర్‌ మేరువ మూర్తి సురేంద్ర మజీద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 11:20 PM