Share News

ఎన్నికల్లో జయచంద్రారెడ్డిని గెలిపించుకుంటాం

ABN , Publish Date - Mar 17 , 2024 | 11:56 PM

కష్టపడి పనిచేస్తాం...తంబళ్లపల్లె నియోజక వర్గ టీడీపీ అభ్యర్థి అయిన తమ స్నేహితుడు దాసరిపల్లి జయచంద్రా రెడ్డిని గెలిపించుకుంటామని పూర్వ విద్యార్థులు స్పష్టం చేశారు.

ఎన్నికల్లో జయచంద్రారెడ్డిని గెలిపించుకుంటాం
టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డి గెలుపుకు కృషి చేస్తామని విజయ సూచిక చూపుతున్న స్నేహితులు

మిత్రుడి కోసం 32 ఏళ్ల తురువాత కలిసిన పూర్వ విద్యార్థులు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా శ్రమిస్తామని వెల్లడి

ములకలచెరువు, మార్చి 17: కష్టపడి పనిచేస్తాం...తంబళ్లపల్లె నియోజక వర్గ టీడీపీ అభ్యర్థి అయిన తమ స్నేహితుడు దాసరిపల్లి జయచంద్రా రెడ్డిని గెలిపించుకుంటామని పూర్వ విద్యార్థులు స్పష్టం చేశారు. స్థానిక జడ్పీ హైస్కూల్‌లో దాసరిపల్లి జయచం ద్రారెడ్డితో పాటు 1991-92 సం వత్సరంలో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం ములకలచెరువులోని పార్టీ కార్యాలయంలో కలుసుకున్నారు. తమ మిత్రుడికి తంబళ్లపల్లె ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం వచ్చినందుకు 32 ఏళ్ల తురువాత మళ్ళీ ఇప్పుడు కలిశారు. తమతో పాటు చదువుతున్న స్నేహితుడు జయచంద్రారెడ్డికి తంబళ్ళపల్లె టీడీపీ అభ్యర్థిగా అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందని, పార్టీల కతీతంగా విజయం సాధించేందుకు తమ వంతు శ్రమిస్తామని వెల్లడించారు. ప్రచా రంలో కూడా పాల్గొని తమతో పాటు తెలిసిన వారికి, బంధువులకు, కుటుంబీ కులకు చెప్పి ఓట్లు వేయిస్తామని హామీ ఇచ్చారు. తమ స్నేహితుడ్ని గెలిపించుకునేందుకు బాధ్యతగా తీసుకుంటామని చెప్పారు. సుమారు 60 మందికి వరకు స్నేహితులు అందరూ కలిసి వచ్చి మద్దతుగా నిలిచారు. తన స్నేహితులు మద్దతు ప్రకటించండంతో జయచంద్రారెడ్డి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. దీంతో పార్టీ కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమాల్లో పూర్వ విద్యార్థులు కల్పనరెడ్డి, సుజాత, రాజేశ్వరి, షాజహాన, భవానీ, అయిషా, హరిత, అమరావతి, లక్ష్మీ, కళావతి, వాణి, బొగ్గు మునీర్‌, అయూబ్‌, రామకృష్ణ, జాన, రమణప్ప, చంద్రశేఖర్‌, మాధవరెడ్డి, రియాజ్‌, జయ చంద్రా, షామీర్‌, రమణ, మహేష్‌రెడ్డి, నాగభూషణరెడ్డి, వెంకట్రామన తదితరులు పాల్గొన్నారు.

మీ సహకారాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటా

ఫ తంబళ్లపల్లె టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డి

కలిసి చదువుకున్న మిత్రులందరూ అందిస్తున్న సహాయసహకారాలను జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రా రెడ్డి పేర్కొన్నారు. ములకలచెరువులోని పార్టీ కార్యాలయంలో మిత్రులతో ఆయన మా ట్లాడుతూ తనతో పాటు చదుకున్న మిత్రులు వచ్చి మద్దతు ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని రైతులందరూ తల ఎత్తు కు జీవించేలా హంద్రీ - నీవా జలాలను ఉపకా లువల ద్వారా ప్రతి చెరువుకు, కుంటకు తెచ్చి నీటితో నింపడమే ధ్యేయంగా పెట్టుకున్నా నన్నారు. నియోజకవర్గంలో ఎక్కువగా టమోటాలు పండిస్తారని, రైతు ల కోసం టమోటా ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు కృషి చేస్తానన్నా రు. టీడీపీ అధికారంలోకి రాగానే నియోజకవర్గంలో ఇండసీ్ట్రయల్‌ క్యారి డ్యార్‌ ఏర్పాటుకు కృషి చేసి నిరుద్యోగాన్ని రూపుమాపుతానన్నారు. తంబళ్లపల్లె నియోజ కవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పరిచి పేదరికం లేకుండా చేస్తానన్నారు.

Updated Date - Mar 17 , 2024 | 11:56 PM